Moviesవిడిపోతున్నాం.. ష‌ణ్ముక్‌తో బ్రేక‌ప్‌పై దీప్తి సున‌య‌న అంతులేని బాధ‌..!

విడిపోతున్నాం.. ష‌ణ్ముక్‌తో బ్రేక‌ప్‌పై దీప్తి సున‌య‌న అంతులేని బాధ‌..!

యూట్యూబ్ వీడియోల‌తో ఫేమ‌స్ అయిన దీప్తి సున‌య‌న, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ చాలా కాలం ప్రేమ‌లో ఉన్నారు. అయితే బిగ్‌బాస్ త‌ర్వాత వీరు విడిపోతున్నార‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌పై స్పందించిన ష‌ణ్ముక్ త‌న చేతిపై టాటూ ఉన్నంత కాలం క‌లిసే ఉంటామ‌ని చెప్పాడు. అయితే దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తాము విడిపోతున్నామంటూ పోస్ట్ పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది.

ఈ పోస్టులో తాను, ష‌ణ్ముక్ విడిపోతున్నామ‌ని.. ఇద్ద‌రం ఎంతో ఆలోచించే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. మాన‌వ సంబంధాలు ఎంతో విలువైన‌వి అని.. చిన్న‌పాటి మ‌న‌స్ప‌ర్థ‌లే ఎంత పెద్ద బంధం అయినా విచ్ఛిన్నం చేస్తాయ‌ని ఆమె పేర్కొంది. ఇక గ‌తంలో కూడా ష‌ణ్ముక్ త‌న లైఫ్ ఇక్క‌డి వ‌ర‌కు రావ‌డంలో దీప్తి పాత్ర చాలా ఉందని చెప్పాడు. అయితే వీరి మ‌ధ్య గ్యాప్ రావ‌డానికి ష‌ణ్ముక్ బిగ్‌బాస్ హౌస్‌లో సిరితో చేసిన ర‌చ్చే అంటున్నారు.

దీప్తి పెట్టిన పోస్టులో ఇద్ద‌రం క‌లిసి ఆలోచించే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. ప‌రస్ప‌ర అంగీకారంతోనే తాము బ్రేక‌ప్ చేసుకున్నామ‌ని.. ఇద్ద‌రం క‌లిసి ఉండేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా.. ఇద్ద‌రి దారులు వేరు అని తేల‌డంతోనే తాము విడిపోతున్నామంటూ ఎంతో బాధ‌తో ఆమె ఈ పోస్టు పెట్టింది. ఎవ్వ‌రూ కూడా త‌మ ప్రైవ‌సీకి భంగం క‌లిగించ‌వ‌ద్ద‌ని ఆమె వేడుకుంది.

వాస్త‌వానికి ష‌ణ్ముక్ హౌస్‌లో ఉన్న‌ప్పుడు అత‌డే టైటిల్ గెలుస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. అత‌డికి అంత ఫాలోయింగ్ ఉంది. బ‌య‌ట ఉన్న దీప్తి కూడా ష‌ణ్ముక్ గెలుపు కోసం ఎంతో క‌ష్ట‌ప‌డింది. అయితే హౌస్‌లో అత‌డు సిరితో క్లోజ్‌గా ఉండ‌డంతో పాటు కాస్త ప‌రిధి దాటిన‌ట్టు ప్రేక్ష‌కులు ఫీల్ అయ్యారు. అందుకే అత‌డు టైటిల్‌కు దూరం అయిపోయాడు. ఇప్పుడు త‌న ప్రేయ‌సికి కూడా దూరం అయిపోయాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news