Moviesభార్యలందరూ వెళ్లిపోవాలి...RGV రూటే వేరబ్బా..?

భార్యలందరూ వెళ్లిపోవాలి…RGV రూటే వేరబ్బా..?

రాంగోపాల్ వర్మ … ఈ పేరే ఒక వివాదం. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందో అక్కడ వర్మ ఉంటాడు. అసలు వర్మ అంటేనే కాంట్రవర్సీ. గిల్లి గిల్లించుకోవడం ఈయనగారికి బాగా అలవాటు. అసలు కావాలని వివాదాల్లోకి దూరుతాడో లేక అసలు అతని నైజం అంతేనా అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని విషయం.రామ్ గోపాల్ వర్మ ఇష్యూ ఏదైనా తనదైన శైలిలో స్పందిస్తారు. వర్మ మార్క్ అంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంచలనాల దర్శకుడు.

అవతలి వాళ్లు ఎవరు అని చూడకుండా.. భయపడకుండా.. ముక్కుసూటిగా మాటలు విసరడంలో వర్మ స్టైలే వేరు.రామ్ గోపాల్ వర్మ ఎవరేమన్నా పట్టించుకునే రకం కాదు. పోలీస్ కేసులు.. కోర్టు నోటీసుల్ని కూడా వర్మ పెద్దగా పట్టించుకున్నట్లగా.. వాటికి భయపడ్డట్లుగా కనిపించడు. ఏదైనా ఇష్యూ మీద భయపడకుండా సినిమాచేయాలి అంటే.. అది వర్మకే సాధ్యం. అందుకే ఆయన సంచలనం అయ్యారు.

కేవలం సినిమాల విషయంలోనే కాదు. తనకు సంబంధం ఉన్నా లేకున్నా ప్రతీ విషయంలో వేళ్ళు పెట్టి రచ్చ చేఅయదం వర్మకు అలవాటుగా మారింది. ప్రస్తుత పరిస్ధితి ఎలా ఉంది అంటే ఏదైన ఇష్యూ జరిగితే..దాని పై ఏ విధంగా స్పందిస్తారా అని ఎదురు చూస్తుంటారు ఆడియన్స్. అంతలా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఇక రీసెంట్ గా న్యూ ఇయర్ విషెస్ చెప్పుతూ కూడా అదే ఫార్ములా వాడారు సెన్సేషన్ అయ్యారు వర్మ.

ఆయన ట్వీట్ చేస్తూ..” కోరికలు అనేవి జీరో ఖర్చుతో వస్తాయి అంటూ మొదలు పెట్టిన ఈయన.. అందుకే నేను నిరాడంబరంగా ఉండాలనుకోవడం లేదు అంటూ ట్వీట్ చేస్తూ. కొత్త సంవత్సరం మీ అందరికీ 20,000 టన్నుల బంగారాన్ని, అంబానీ కంటే మెరుగైన ఇల్లు, వైరల్ ప్రూఫ్ హెల్త్, మిమ్మల్ని బాధించే భార్యలందరూ విడిచివెళ్లిపోవాలి.. మీకు నచ్చిన హీరోయిన్లు అందరూ పరుగులు పెట్టుకుంటూ రావాలి’ అంటూ తనదైన స్టైల్లో న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఈ ట్వీట్‌తో మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారారు వర్మ.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news