Moviesకృతి శెట్టికి లెట‌ర్ ఇచ్చిన‌ చిరంజీవి..అందులో ఏముందో తెలిస్తే షాకే!

కృతి శెట్టికి లెట‌ర్ ఇచ్చిన‌ చిరంజీవి..అందులో ఏముందో తెలిస్తే షాకే!

కృతి శెట్టి.. ఇప్పుడీ పేరు టాలీవుడ్ మారుమోగిపోతోంది. 2021లో విడుద‌లైన `ఉప్పెన` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన కృతీ.. తొలి చిత్రంతోనే సంచ‌ల‌న విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. అదే స‌మ‌యంలో బేబమ్మగా త‌న‌దైన అందం, అభిన‌యంతో కుర్రాళ్ళ గుండెల్లో మంట పెట్టేసింది. ఈ క్ర‌మంలోనే వ‌రుస ఆఫ‌ర్లు ఆమె త‌లుపు త‌ట్టాయి.

ఇక ఉప్పెన త‌ర్వాత కృతీ న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాలు సైతం ఈ మ‌ధ్య విడుద‌లై సూప‌ర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో మొద‌టి మూడు సినిమాల‌తోనూ హిట్స్ అందుకున్న హీరోయిన్‌గా కృతి శెట్టి రికార్డు సృష్టించింది. మొత్తానికి హ్యాట్రిక్ హిట్స్‌తో మాంచి జోరు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ‌.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి గెస్ట్‌గా విచ్చేసింది.

ఈ సంద‌ర్భంగా ఎన్నో విష‌యాల‌ను పంచుకున్న కృతి శెట్టి.. త‌న‌కు మెగాస్టార్ చిరంజీవి లెట‌ర్ ఇచ్చిన‌ట్టు కూడా పేర్కొంది. ఈ ప్రోగ్రామ్‌లో కృతి మాట్లాడుతూ.. `తన తొలి సినిమా ఉప్పెన సక్సెస్ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన గురించి చిరంజీవి గారు మాట్లాడడం పెద్ద బహుమతి.

కానీ సినిమా రిలీజ్ అయ్యాక మ‌ళ్లీ తన చేతితో స్వ‌యంగా రాసిన ఓ లెటర్ మ‌రియు గిఫ్ట్ బాక్స్‌ను చిరంజీవి గారు పంపారు. ఆ లెట‌ర్‌లో యూ ఆర్ ఏ బోర్న్ స్టార్ అని రాశారు. దాంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకే ఆ లెటర్ ను ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకున్నాను.` అంటూ చెప్పుకొచ్చింది. దాంతో కృతి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, కృతి శెట్టి సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈమె రామ్‌తో `ది వారియర్`, సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం` చిత్రాలు చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news