Moviesబాల‌య్య - గోపీచంద్ సినిమా స్టోరీ లైన్ ఇదే...? టైటిల్...

బాల‌య్య – గోపీచంద్ సినిమా స్టోరీ లైన్ ఇదే…? టైటిల్ కూడా ఫిక్సా ?

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అఖండ సినిమా స‌క్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా రు. 150 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో పాటు 50 రోజుల‌కు చేరువ అయ్యింది. అస‌లు ఇప్పుడు ఉన్న ఈ క‌ష్ట ప‌రిస్థితుల్లో ఓ సినిమాకు లాంగ్ ర‌న్ ఉండ‌డం లేదు. అలాంటిది అఖండ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 50కు పైగా కేంద్రాల్లో 50 రోజుల‌కు చేరువ అవుతోంది. మ‌రోవైపు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షోతో ఇక్క‌డ కూడా బాల‌య్య షేక్ చేస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రిస్తున్నాడు. బాల‌య్య నెక్ట్స్ మూవీ మ‌లినేని గోపీచంద్ ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడితో మ‌రో సినిమా రానుంది. ఇలా బాల‌య్య లైన‌ప్‌లో అంద‌రూ క్రేజీ డైరెక్ట‌ర్లే ఉన్నారు. ఇదిలా ఉంటే బాల‌య్య – గోపీచంద్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కే సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో ఓ లైన్ చ‌క్కెర్లు కొడుతోంది.

ఈ లైన్ ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌య్య డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. ఒక రోల్ యంగ్ రోల్‌.. రెండో రోల్లో బాల‌య్య 60 ఏళ్ల వృద్ధుడిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. వృద్ధుడు పాత్ర‌ను పోషిస్తోన్న బాల‌య్య‌ను రాయ‌ల‌సీమ జ‌నాలు పెద్దాయ‌న‌గా పిలుచుకుంటార‌ట‌. ఇక బాల‌య్య స‌ర‌స‌న శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో విల‌న్‌గా దునియా విజ‌య్‌ న‌టిస్తున్నాడు.

సీమ ప్రాంతంలో ప‌రిశ్ర‌మ‌లు పెడితే అక్క‌డ ల‌క్ష‌లాది మందికి ఉపాధి దొరుకుతుంది.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. అయితే అక్క‌డ కొంద‌రు వ్య‌క్తుల‌తో పాటు కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల్ల అక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా పారిశ్రామిక వేత్త‌లు ముందుకు రారు ? ఇందుకు కార‌ణం ఏంటి ? బాల‌య్య ఈ స‌మ‌స్య‌ల‌కు ఎలా చెక్ పెట్టి ? అక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల గుండెల్లో దేవుడుగా నిలిచిపోయాడు ? అన్న‌దే ఈ సినిమా మెయిన్ లైన్‌గా తెలుస్తోంది.

ఇక కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కూడా నెగిటివ్ ట‌చ్ ఉన్న మ‌హిళా విల‌న్‌గా క‌నిపించ‌బోతోంద‌ని అంటున్నారు. మైత్రీ మూవీస్ వారు ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు వేట‌పాలెం అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news