Moviesబాల‌య్య 107 టైటిల్‌కు చిరంజీవికి భ‌లే లింక్ ఉందే..!

బాల‌య్య 107 టైటిల్‌కు చిరంజీవికి భ‌లే లింక్ ఉందే..!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా వ‌చ్చిన అఖండ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విజ‌యాన్ని బాల‌య్య బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ యాక్ష‌న్‌కు తోడు బాల‌య్య అఘోరాగా త‌న న‌ట విశ్వ‌రూపం చూపించ‌డంతో ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా బాగా క‌నెక్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం థ‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన నేప‌థ్య సంగీతంతో పాటు పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఊపేశాయి. ఈ క్ర‌మంలోనే జై బాల‌య్య మాస్ బీట్ జ‌నంలోకి ఓ రేంజ్‌లో దూసుకుపోయింది.

బాల‌య్య అభిమానుల‌కు నినాదంగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ బాల‌య్య నెక్ట్స్ సినిమా టైటిల్ కానుంద‌ట‌. బాల‌య్య నెక్ట్స్ సినిమా మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. మ‌లినేని గోపీచంద్ గ‌తేడాది క్రాక్ సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చీరాల దగ్గ‌ర వేట‌పాలెంలో జ‌రిగిన యదార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక ఈ సినిమాకు జై బాల‌య్య టైటిల్ పెడితే సినిమాకు మాంచి బ‌జ్ వ‌స్తుందంటున్నారు. శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో బాల‌య్య రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. ఇక 1997లో చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన మాస్ట‌ర్ సినిమాలో బాగున్నారా.. బాగున్నారా బావగారు బాగున్నారా అన్న పాట సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ మ‌రుస‌టి యేడాదే ఆయ‌న ఇదే టైటిల్ పెట్టి సినిమా తీస్తే సూప‌ర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు కాక‌తాళీయంగా బాల‌య్య సినిమాకు కూడా ఇలాగే టైటిల్ పెడ‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే సెంటిమెంట్ రిపీట్ అయ్యి.. మలినేనీ గోపీచంద్ స్టైల్లో మాస్ సినిమా తెర‌కెక్కిస్తే బాల‌య్య‌కు వ‌రుస‌గా రెండో హిట్ ప‌డిన‌ట్లు అవుతుంది. ఈ సినిమాను ఈ యేడాది ద‌స‌రాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news