Moviesబాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మ‌లైకా అరోరా - అర్జున్ క‌పూర్ బ్రేక‌ప్‌..!

బాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మ‌లైకా అరోరా – అర్జున్ క‌పూర్ బ్రేక‌ప్‌..!

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ – మలైకా ఆరోరా గ‌త నాలుగేళ్లుగా ఎంత సీరియ‌స్‌గా డేటింగ్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇండియా నుంచి విదేశాల వ‌ర‌కు ఎక్క‌డ చూసినా కూడా ఈ ప్రేమ జంట చ‌క్కెర్లు కొడుతూనే ఉన్నారు. నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఉన్న మలైకా త‌న కంటే వ‌య‌స్సులో 12 ఏళ్లు చిన్న‌వాడు అయిన అర్జున్ క‌పూర్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయినా వీరిద్ద‌రు అవేం ప‌ట్టించుకోకుండా ఎంజ‌క్కా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.

మ‌లైకా అర్జున్‌తో ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాతే త‌న భార్త అర్బాజ్‌ఖాన్‌కు విడాకులు ఇచ్చి మ‌రీ అత‌డి మైకంలో మునిగి తేలుతోంది. ఈ వ‌య‌స్సులో కూడా ఆమె బికినీ వేసుకుని కుర్ర హీరోయిన్ల‌కు పోటీగా పోజులు ఇస్తూ ఉంటుంది. మ‌లైకాను ఎంతో మంది సూటిపోటి మాట‌ల‌తో అన్నా కూడా ఆమె అవేమి ప‌ట్టించుకోలేదు. అయితే కొద్ది రోజుల క్రితం వారిద్ద‌రు విడిపోతున్నార‌ని ప్రచారం జ‌రిగినా కూడా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ మాది మ‌రింత ఘాటైన ప్రేమ అని చెప్పారు.

అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ బ్రేక‌ప్ అయిపోయింద‌ని ఇప్పుడు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ సారి వీరు క‌లిసే ఛాన్సులు లేవ‌ని అంటున్నారు. రీసెంట్‌గా వీరి మ‌ధ్య పొరా పొచ్చ‌లు వ‌చ్చిన‌ట్టు టాక్ ? కొద్ది రోజులుగా వీరిద్ద‌రు దూరంగా ఉంటున్నార‌ని.. క‌నీసం వీరి మ‌ధ్య ఫోన్ కాంటాక్టులు కూడా లేవ‌ని అంటున్నారు. రీసెంట్‌గా అర్జున్ క‌పూర్ రియాక‌పూర్ ఇంటికి వెళ్లాడ‌ట‌. ఆ ప‌క్క‌నే మ‌లైకా ఇళ్లు కూడా ఉంది. అస‌లు అర్జున్ అటు వైపే చూడ‌లేద‌ట‌.

అర్జున్ మ‌లైకా ఇంటికి వెళ్ల‌కుండా నేరుగా రియాక‌పూర్‌ను క‌లిసి వ‌చ్చేశాడ‌ట‌. దీంతో ఈ బ్రేక‌ప్ నిజ‌మే అని అంటున్నారు. అస‌లు ఎప్పుడూ అర్జున్‌ను వ‌దిలి ఉండ‌లేని మ‌లైకా ఇప్పుడు అర్జున్ చాయ‌ల‌కు కూడా రావ‌డం లేద‌ట‌. ఒక్క‌రోజు కూడా ప్రియురాలిని వ‌దిలి ఉండ‌లేని అర్జున్ ఇప్పుడు దూరంగా ఉండ‌డంతో వీరిద్ద‌రి బ్రేక‌ప్ పూర్త‌య్యింద‌న్న వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news