Moviesఆ స్టార్ డైరెక్ట‌ర్ జీవితంలో అమ‌లాపాల్ చిచ్చు...!

ఆ స్టార్ డైరెక్ట‌ర్ జీవితంలో అమ‌లాపాల్ చిచ్చు…!

కోలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ హీరోయిన్ అమ‌లాపాల్ వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.. ఆమె వీట‌న్నింటిని త‌ట్టుకుని ఇప్పుడు న‌టిగా ముందుకు సాగే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆమె అటు త‌మిళ్‌తో పాటు ఇటు తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తోంది. గ‌తంలోలా కాకుండా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తోంది. ఇక సినిమాల‌తో పాటు ఆంధాల‌జీలు, వెబ్‌సీరిస్‌ల‌కు కూడా సై అంటోంది.

 

ఇప్ప‌టికే తెలుగులో కుడిఎడ‌మైతే వెబ్‌సీరిస్ చేసిన అమ‌లాపాల్ తాజాగా హిందీలోనూ ఓ వెబ్‌సీరిస్‌లో న‌టిస్తోంది. రంజిష్ హీ స‌హీ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సీరిస్ జ‌న‌వ‌రి 13 నుంచి ఓటీటీలో ప్ర‌సారం అవుతోంది. ఈ వెబ్‌సీరిస్ ట్రైల‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. పుష్ప‌దీప్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌భ‌ట్ ఈ వెబ్ సీరిస్‌ను నిర్మించాడు.

ఇందులో 83 సినిమాలో సునీల్ గ‌వాస్క‌ర్‌గా న‌టించిన తాహిర్ రాజ్ బ‌సీన్ శంక‌ర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ వెబ్ సీరిస్ స్టోరీ అంతా మ‌హేష్ భ‌ట్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో భార్య అంటే ఎంతో ప్రేమ‌తో ఉండే ద‌ర్శ‌కుడి జీవితంలోకి ఓ పాపుల‌ర్ న‌టి, సింగ‌ర్ అడుగు పెట్ట‌డంతో ఆ ద‌ర్శ‌కుడి జీవితం ఎలా ? మ‌లుపులు తిరిగింది ? అన్న‌దే సారాసం.

ఆ ద‌ర్శ‌కుడి వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టే స్టార్‌గా అమ‌లాపాల్ న‌టించింది. అయితే క‌థ డిమాండ్ చేయ‌డంతో అమ‌లాపాల్ మ‌ద్యం తాగ‌డంతో పాటు సిగ‌రెట్ తాగ‌డం, లిప్‌లాక్ చేయ‌డం కూడా చేసింది. ట్రైల‌ర్లో ఈ సీన్లు బాగా వైర‌ల్ అయ్యాయి. ఈ పాత్ర‌తో అమ‌ల మ‌రింత పాపుల‌ర్ అవుతుంద‌నే అంటున్నారు. ఆమె కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో పాటు న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లు కూడా చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news