Moviesబంగార్రాజు ట్రైల‌ర్‌... సోగ్గాడు అమ్మ మొగుడేరా బాబోయ్ (వీడియో)

బంగార్రాజు ట్రైల‌ర్‌… సోగ్గాడు అమ్మ మొగుడేరా బాబోయ్ (వీడియో)

అక్కినేని నాగార్జున – కుర‌సాల క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సోగ్గాడే చిన్నినాయ‌నా 2016 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. 2016 లో బాల‌య్య డిక్టేట‌ర్‌, ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో, శ‌ర్వానంద్ ఎక్స్‌ప్రెజ్ రాజా ఈ మూడు సినిమాల‌కు పోటీగా వ‌చ్చి కూడా ఆ సినిమాల‌ను మించేలా సోగ్గాడు హిట్ అయ్యింది. నాగార్జున కెరీర్‌లో ఫ‌స్ట్ రు. 50 కోట్ల సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు వ‌స్తోంది. జీ స్టూడియోతో పాటు అన్న‌పూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో నాగార్జున , ర‌మ్య‌కృష్ణ‌తో పాటు నాగ్ త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌, కృతిశెట్టి కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ కానున్నారు. నాగార్జున మ‌న‌వ‌డుగా నాగ‌చైత‌న్య పాత్ర ఉండ‌బోతోంద‌ని తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్‌లో క్లారిటీ ఇచ్చేశారు. మొత్తం 2.06 నిమిషాలు ఉన్న ట్రైల‌ర్ అదిరిపోయింది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే సోగ్గాడుకు అమ్మ‌మొగుడులా బంగార్రాజు ఉండ‌బోతోంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

ట్రైల‌ర్ అంతా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చంపేసింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక ట్రైల‌ర్‌లో కావాల్సినంత ఫ‌న్‌, రొమాన్స్‌తో పాటు యాక్ష‌న్ కూడా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. సోగ్గాడు పాత్ర‌లో నాగార్జున అమ్మాయిల‌ను ఎలా ప‌డేస్తాడు ? ఎన్ని సోకులు పోతాడో ? ఇప్పుడు ఆయ‌న మ‌న‌వ‌డు నాగచైత‌న్య కూడా అమ్మాయిల విష‌యంలో అంతే సోకులు పోతాడ‌ని ట్రైల‌ర్‌లో చూపించారు.

ఇక నాగచైత‌న్య‌, కృతిశెట్టి ల‌వ్ ట్రాక్ సినిమాకే మేజ‌ర్ హైలెట్ కానుంది. ఈ సంక్రాంతి పండ‌గ‌కు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా అస‌లు సిస‌లు మజా అందించ‌బోతోంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సినిమాలో రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news