Movies2021లో స‌మంత నుంచి ఆమీర్ వ‌ర‌కు విడాకులు తీసుకున్న టాప్ సెల‌బ్రిటీలు...

2021లో స‌మంత నుంచి ఆమీర్ వ‌ర‌కు విడాకులు తీసుకున్న టాప్ సెల‌బ్రిటీలు వీళ్లే…!

సినిమారంగంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం.. డేటింగ్‌లు చేసుకోవడం… పెళ్లి చేసుకోవడం కొన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేశాక విడిపోవడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే 2017లో చాలామంది టాప్ హీరో, హీరోయిన్లు విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచారు. ఈ యేడాది విడాకులు తీసుకున్న‌ హీరో, హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

ఆమీర్‌ఖాన్ – కిర‌ణ్‌రావు:
2021లో దేశం మొత్తాన్ని ఊపేసిన వార్త అమీర్ ఖాన్ – కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకోవడం. లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ఏర్పడిన పరిచయంతో తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిర‌ణ్‌ను ఆమీర్‌ పెళ్లి చేసుకున్నాడు. 2006లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడిపోయింది. ఫాతిమా సనా షేక్ తో డేటింగ్‌లో ఉండటంతోనే ఆమీర్ కిరణ్ కు విడాకులు ఇచ్చాడని వార్తలు గుప్పుమన్నాయి.

నాగ‌చైత‌న్య – స‌మంత‌:
ఇక టాలీవుడ్‌ను ఒక కుదుపు కుదిపేసింది సమంత – నాగచైతన్య విడాకుల వార్త‌. వీరి విడాకులు ఇప్పటికీ వార్తల్లోనే ఉంటున్నాయి. 2017 లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగు సంవత్సరాల పాటు కలిసి కాపురం చేశాక విడిపోయారు. అసలు వీరిద్దరూ ఎందుకు ? విడిపోయారో ? ఇప్పటికీ చాలామందికి తెలియదు.

నుస్ర‌త్ జ‌హాన్ – నిఖిల్ జైన్‌:
ఇక తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుస్ర‌త్ జ‌హాన్ – బెంగాల్‌ పారిశ్రామికవేత్త నిఖిల్ జైన్ పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో వీరు విడాకులు తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ ఎంపీ గెలిచిన నుస్ర‌త్‌ ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వార్తలతో మీడియాలో ఉంటున్నారు. ఈ జంట పెళ్లికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు.. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

కీర్తి కుల్హారి – సాహిగ‌ల్ సెహ‌గ‌ల్‌:
ఇక మరో నటి కీర్తి కుల్హారి – సాహిగ‌ల్ సెహ‌గ‌ల్ పెళ్లి చేసుకుని ఐదు సంవత్సరాలు కాపురం చేశాక… ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. 2016లో వీరి పెళ్లి జరిగింది.

నిషా రావ‌ల్ – క‌ర‌ణ్ మెహ్రా:
నిషా రావ‌ల్‌, త‌న భ‌ర్త క‌ర‌ణ్ గృహ‌హింస‌కు పాల్ప‌డ్డాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అంతేకాదు అత‌డికి మ‌రో మ‌హిళ‌తో సంబంధం ఉంద‌ని ఆరోపించ‌డంతో వీరిద్ద‌రు విడిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news