Moviesఒకరితో పెళ్ళి..మరోకరితో కాపురం..ఏందిరా అయ్యా ఇది..?

ఒకరితో పెళ్ళి..మరోకరితో కాపురం..ఏందిరా అయ్యా ఇది..?

మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్ టైమ్ నడుస్తోంది. గత కొద్దికాలంగా ఈ సంగీత దర్శకుడు వరుసగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ వస్తున్నాడు. సినిమా చిన్నది అయినా పెద్దది అయినా కానీ దానికి మ్యూజిక్ ఇవ్వాలసింది తమన్ నే అన్నత్లు తయారైంది పరిస్ధితి. ఇటీవల ప్రకటించిన భారీ బడ్జెట్‌ చిత్రాల నుంచి సాధారణ చిత్రాల వరకు సింగీత దర్శకుడిగా మ్యూజిక్‌ సెన్సె షన్‌ ఎస్‌ఎస్‌ తమన్‌ పేరు వినిపిస్తోంది.

అవన్నీ భారీ హిట్లే కావడంతో తమన్ కు అల కలిసొస్తుంది. ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రాంచరణ్ ప్రాజెక్ట్ లు కూడా తమన్ చేతిలోనే ఉన్నాయి. ఓ పక్క స్టార్ హీరోల సినిమాలు..మరో పక్క కుర్ర హీరోల సినిమాల ఆఫర్లు వరసగా క్యూ కడుతున్నాయి. దీంతో తమన్‌ ఫుల్‌ బిజీగా మారాడు.

ఇలా వరుస సినిమాలను చేస్తూనే.. త్వరలో పట్టాలెక్కబోతున్న సినిమాలకు కూడా రెడీ అవుతున్నాడు తమన్. అలాగే తమిళ్ సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.కరోనా తర్వాత ఈ యంగ్ మ్యూజిక్ డైనమేట్ స్పీడ్ పెంచారు. ఇప్పుడు తమన్ చేతిలో దాదాపు 10కి పైగా సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో తమన్ పనిచేశారు. ఇప్పటివరకు అందరు హీరోలతో పని చేసిన తమన్ ..ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందించలేక పోయాడు. దీంతో నిరాశతో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చేప్పుతూ రాధే శ్యాం బృందం క్రేజీ అప్డేట్ ఇచ్చింది.

ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని రాధే శ్యామ్ సినిమా మీద పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఉండాలని చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం హిందీకి ఓ మ్యూజిక్ డైరెక్టర్.. దక్షిణాదికి ఓ మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ నేపథ్య సంగీతం కోసం తమన్‌ను తీసుకున్నారు. ఈ మేరకు అదికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. మొత్తానికి తమన్ మాత్రం రాధే శ్యామ్ యూనిట్‌తో కలిసి పని చేయబోతోన్నాడు.

ఇక తాజాగా తమన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికె ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించిన థమన్ సౌత్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం అలాగే హిందీ సినిమాలకు సంగీతం అందించాడు. అయితే బాలీవుడ్‌ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసారు. బాలీవుడ్ లో ఒక సినిమాకు ఆరుమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా పనిచేస్తారో అర్థం కావడంలేదు అంటూనే.. ఒకడు సాంగ్ చేస్తే ఇంకొకడు ఒక రీల్‌కు ఆర్ ఆర్ చేస్తాడు ..ఇది ఎలా ఉంటుందంటే ఒకరిని పెళ్ళి చేసుకొని మరొకరితో కాపురం చేసినట్టుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం తమన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news