Moviesఫహాద్ ఫాజిల్ కు నాగార్జునతో ఉన్న సంబంధం ఇదే..!!

ఫహాద్ ఫాజిల్ కు నాగార్జునతో ఉన్న సంబంధం ఇదే..!!

స్టైలిష్ట్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. మొదటిసారిగా డిగ్లామరస్ రోల్ లో కనిపించనుంది రష్మిక.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. నిజానికి ఫహాద్ ఫాజిల్ మలయాళం నటుడు. కానీ తెలుగులో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలా అంటే కరోనా మహమారి కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైయారు.

ఆ టైంలో ఓటీటీలో వచ్చిన సినిమాలు, పాత సినిమాలు చూస్తున్న టైంలో ఫహద్ ఫాజిల్ సినిమాలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. అలా తెగులో ఒక్క సినిమా కూడా తీయ్యకుండానే మంచి క్రేజ్ సంపాదించుకునారు. మలయాళం లో అతను స్టార్ యాక్టర్..కానీ పుష్ప సినిమా ద్వారా విలన్ గా పరిచయం కానున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రల్లో నటించి తన కంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నారు ఫహాద్ ఫాజిల్.

ఇక ఈయన తండ్రీ పేరు ఫాజిల్ . ఈయన ఓ పెద్ద డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి ఎందరో స్టార్స్ కి లైఫ్ ఇచ్చారు. ఇక నాగార్జున కి ఫహాద్ ఫాజిల్ కు ఉన్న కనెక్షన్ ఏంటంటే.. ఫహద్ తండ్రి ఫాజిల్ తెలుగులో హీరో అక్కినేని నాగార్జున తో ఓ సినిమా చేసాడు.

ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇంతకి ఆ సినిమా ఏంటో తెలుసా..”కిల్లర్”. ఫహద్ తండ్రి ఫాజిల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలా ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫహద్. ఇప్పుడు విలన్ గా టాలీవుడ్ ప్రజలని మెప్పించడానికి రాబోతున్నాడు. మరి చూడాలి ఎలా మెప్పిస్తారో ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news