Moviesవాళ్లందరికి బంగారు ఉంగరాలు..బన్నీ ఐడియా అదుర్స్..!!

వాళ్లందరికి బంగారు ఉంగరాలు..బన్నీ ఐడియా అదుర్స్..!!

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సినిమానే “పుష్ప”. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇప్పటికి వరకు రిలీజ్ అయిన పాటలు,ఫస్ట్ లుక్స్, చూస్తుంటే ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు బన్నీ అభిమానులు. ఇక సుకుమార్ ఏమో రంగస్థలం సినిమాతర్వాత , అల వైకుంఠపురం తర్వాత బన్నీ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కన్నడ సొయగం రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక ఫుల్ డిగ్లామరస్ లో కనిపించనుండడం మరో విశేషం.

రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ బట్టి.. పుష్ప సినిమా ఎంత గ్రాండ్‌గా విజువల్ ఫీస్ట్ ఉండబోతుందో కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. సునీల్, అనసూయ ఇందులో కీలక పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందలా తార సమంత ఓ స్పెషల్ సాంగ్ ను చేయబోతుంది. ఈ విషయాని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

కాగా, బన్నీ తన టీమ్ మెంబర్స్ వర్క్ కి ఫిదా అయి ఏకంగా 12 మంది టీమ్ మెంబర్స్ కి గోల్డ్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చాడట. ఐటెం సాంగ్ షూటింగ్‌ని ఇంత త్వ‌ర‌గా పూర్తి చేసినందుకు ఫుల్‌గా ఇంప్రెస్ అయిన బ‌న్నీ 12మంది సిబ్బందికి ఒక తులం (10 గ్రాములు) విలువైన బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారట‌. ఇందులో అసిస్టెంట్, ఆర్ట్ డైరెక్టర్లు మరియు ఇతర సిబ్బంది ఉన్న‌ట్టు తెలుస్తుంది. పుష్ప టీమ్ సమంత బన్నీలపై ఐటమ్ సాంగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో పూర్తి చేసింది. సాంగ్ అనుకున్న సమయానికి పూర్తి కావడంతో టీమ్ మెంబర్స్ కష్టానికి ఫిదా అయిన బన్నీ వారిని అభినందిస్తూ .. గోల్డ్ రింగ్స్ ని బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news