Moviesఈ ముస‌లి హీరోల‌కు కుర్ర హీరోయిన్లు కావాలా...!

ఈ ముస‌లి హీరోల‌కు కుర్ర హీరోయిన్లు కావాలా…!

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలు గా ఉన్న‌ చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్‌ల‌కు హీరోయిన్ల సమస్య వెంటాడుతోంది. ఈ నలుగురు హీరోలు సినిమాలు చేస్తున్నారంటే వీరి పక్కన నటించేందుకు హీరోయిన్లను సెట్ చేయడం దర్శకులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. చిరంజీవి పక్కన చివరకు మిల్కీ బ్యూటీ తమన్నాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి హీరోయిన్‌గా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు… అటు బాలీవుడ్ లోనూ సీనియర్ హీరోల పక్కన హీరోయిన్లు దొరకని పరిస్థితి ఉంది. ఏకంగా 30 నుంచి 35 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న అమ్మాయిలతో సీనియర్ హీరోలు రొమాన్స్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

తాజాగా 54 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న అక్ష‌య్‌కుమార్‌.. 24 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న మానుషీ చిల్ల‌ర్‌తో క‌లిసి న‌టిస్తున్నాడు. 30 ఏళ్ల ఏజ్‌ గ్యాప్ పై హిందీ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. గ‌తంలో సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌న‌వ‌రాలిగా ఓ సినిమాలో న‌టించిన శ్రీదేవి.. ఆ త‌ర్వాత ఆయ‌న ప‌క్క‌నే హీరోయిన్‌గా చేసింది.
త‌మిళంలో కూడా శివాజీ గ‌ణేష‌న్ లాంటి వాళ్లు అప్ప‌ట్లో వ‌య‌స్సులో త‌మ కంటే చాలా చిన్న అమ్మాయిల‌తో రొమాన్స్ చేశారు.

ఇప్పుడు భోళా శంక‌ర్‌లో చిరంజీవి త‌న కంటే 30 ఏళ్లు చిన్న‌ది అయిన త‌మ‌న్నాతో ఆడిపాడుతున్నాడు. పైగా అదే త‌మ‌న్నా చిరు త‌న‌యుడు చెర్రీ సినిమాలో కూడా హీరోయిన్‌గా న‌టించింది. ఇక ఇదే అక్ష‌య్ ల‌క్ష్మీబాంబ్ సినిమాలో కూడా త‌న కంటే చాలా చిన్న‌ది అయిన కియారా అద్వానీతో రొమాన్స్ చేశాడు. అస‌లు అక్ష‌య్ కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పుడు కియారా పుట్టి కూడా ఉండ‌దు.

త‌మిళంలో ర‌జ‌నీకాంత్, అటు కేర‌ళ‌లలో ముమ్ముట్టి, మోహ‌న్‌లాల్ కూడా త‌మ వ‌య‌స్సులో స‌గం వ‌య‌స్సు కూడా లేని హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తున్నారు. దీంతో ఈ హీరోల‌ను ఇప్పుడు నెటిజ‌న్లు ముస‌లి తాత‌లు.. మీకు కుర్ర అమ్మాయిలు కావాలా ? అని ఆటాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news