Moviesఆ హీరో భార్య‌కు మెసేజ్‌ల‌తో న‌ర‌కమే.. హీరో కామెంట్స్ వైర‌ల్‌..!

ఆ హీరో భార్య‌కు మెసేజ్‌ల‌తో న‌ర‌కమే.. హీరో కామెంట్స్ వైర‌ల్‌..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్ – కొత్త బంగారులోకం సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న వ‌రుణ్‌కు ఆ తర్వాత కూడా ఒకటి రెండు హిట్‌ సినిమాలు వచ్చాయి. అనంతరం కథలు ఎంచుకోవడంలో రాంగ్‌ స్టెప్పులు వేస్తూ వస్తున్న వ‌రుణ్‌కు ఒక్క హిట్ కూడా రావడం లేదు. వరుణ్ సందేశ్ పద్నాలుగు సినిమాలు వ‌రుస‌గా డిజాస్ట‌ర్ అయ్యాయి. వరుణ్ వ‌రుస‌ పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు తప్ప అవి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు.

అయితే బిగ్ బాస్ సీజన్ త్రీలో వరుణ్ సందేశ్ తన భార్య వితిక షేరుతో కలిసి పాల్గొన్నారు. బిగ్ బాస్ త్రీ సీజన్ లో హౌస్‌లో భార్య భర్తలుగా ఉన్న వ‌రుణ్ – వితిక ఇద్దరు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. వరుస ఫ్లాపులతో తెలుగు ప్రేక్షకులు వరుణ్ సందేశ్ ను ఎప్పుడో మర్చిపోయారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళటం వ‌రుణ్‌కు ప్ల‌స్‌ అయింది. త్వరలో వరుణ్ సందేశ్ నటించిన ఇందువ‌ద‌న‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ల‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వరుణ్ వెల్లడించారు.

తాను తన కెరీర్లో నిలదొక్కుకునేందుకు తన తండ్రి ఎంతో కష్టపడ్డారు అని… తన తండ్రి తనకు ఎన్నో విష‌యాల్లో అండ‌గా నిలిచార‌ని వరుణ్ సందేశ్ చెప్పారు. ఇక పడ్డానండి ప్రేమలో సినిమాలో తనతో కలిసి నటించిన వితిక తో ప్రేమలో పడిన వరుణ్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. వితిక ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన అమ్మాయి. తన తండ్రి తన భార్యను కూడా సొంత కూతురిలా చూసుకుంటారని తెలిపారు. అలాంటి తండ్రి దొరకడం తనకు అదృష్టం అని గర్వంగా చెప్పాడు.

అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక వితకను కొందరు బాగా ట్రోల్ చేశారని… ఆ మెసేజ్‌లు చూసి ఆమె చాలా వాపోయింది అని అని చెప్పాడు. తనకు కొన్ని మెసేజ్‌లు చూపించిందని అవి చూసిన తర్వాత అవి పెట్టిన వాళ్లను ఏమని అనాలో కూడా అర్థం కాలేదని వాపోయాడు. ఏదేమైనా రియాలిటీ షోలను చూసి మనిషి క్యారెక్టర్ ను జడ్జ్ చేయడం సరికాదని… వితికా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక చాలా బాధపడింది అని వెల్లడించారు. తమకు ఇంకా పిల్లలు లేరనే విషయాన్ని కూడా వ‌రుణ్‌ చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news