Moviesఆ హీరోయిన్ చేతిలో సుడిగాలి సుధీర్‌కు ఘోర అవ‌మాన‌మే..!

ఆ హీరోయిన్ చేతిలో సుడిగాలి సుధీర్‌కు ఘోర అవ‌మాన‌మే..!

బుల్లితెరపై స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ ఉన్నాడు అంటే ఆ ఎపిసోడ్ ఎంతలా పేలిపోతుందో దానికి రేటింగ్ లు ఎలా వస్తాయో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సుధీర్‌కు రష్మీ కూడా తోడయింది అంటే బుల్లితెర షేక్ అయిపోవాల్సిందే. వీరిద్దరూ కలిసి పెర్పామ్ చేసిన ఎపిసోడ్లకు స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు రాని రేటింగ్ వచ్చిందంటే వీరికి ఎలాంటి క్రేజ్‌, రేంజ్‌ ఉందో తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ – రష్మి ఇద్దరు కూడా అటు బుల్లితెర‌పై.. ఇటు వెండితెరపై కూడా కుమ్ముతున్నారు.

సుధీర్ ఒకవైపు జబర్దస్త్ ప్రోగ్రాంలో పాల్గొంటూనే.. మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. ఈ కార్యక్రమానికి ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమెను చాలా ఇంప్రెసివ్ గా ఆహ్వానించిన సుధీర్ ఆమె రాగానే ఆమెతో చేయి కలిపేందుకు ప్రయత్నించాడు. అయితే మహేశ్వరి సుధీర్‌కు చేయివ్వ‌కుండా రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పింది.

వెంటనే సుధీర్ నేను హలో అంటే మీరు నమస్తే అన్నారు.. అని అనడంతో మహేశ్వరి నేను నీతో చేయి కలిపితే… నువ్వు పులిహార కలుపుతావు అంటూ సుధీర్ గాలి తీయడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. అనంతరం సుధీర్ మాట్లాడుతూ మేడం నన్ను ఎక్కడ ఉండమంటారు ? అని అడగగా వెంటనే మహేశ్వరి నాకు మాత్రం దూరంగా ఉండు అనడంతో మరోసారి అక్కడ నవ్వులు పూశాయి.

ఇలా సుధీర్ పై జబర్దస్త్ ప్రోగ్రాంలో ఉన్నవారంతా గొల్లున నవ్వారు. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ఇది సుధీర్‌కు ఘోర అవ‌మాన‌మే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్ సోష‌ల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరిని చూస్తుంటే అసలు ఆమెనా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news