Moviesఓయో రూమ్ లో బెడ్‌పై ఫుల్ శాటిస్‌ఫై.. పిచ్చగా ఎంజాయ్ చేసా..గుట్టువిప్పిన...

ఓయో రూమ్ లో బెడ్‌పై ఫుల్ శాటిస్‌ఫై.. పిచ్చగా ఎంజాయ్ చేసా..గుట్టువిప్పిన యాంకర్ విష్ణుప్రియ..!!

ఈ రోజుల్లో బుల్లితెర యాంకర్స్ హవా మరింత పెరిగింది. హీరోయిన్లను మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు బుల్లితెర బ్యూటీలు. వెండితెరపై హీరోయిన్లు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారో.. అంతకుమించి అన్నట్లుగా దూసుకుపోతున్నారు నేటితరం బుల్లితెర యాంకర్లు. షో హోస్ట్ చేయడంలో ఎవరికి వారు ప్రత్యేకత చాటుకుంటూ అందాలతో అట్రాక్ట్ చేస్తుండటమే గాక సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.

టాలీవుడ్ లో బుల్లితేర పై ఎందరో యాంకర్ ఉన్నారు. ఎంత మంది ఉన్నా ఒక్కోకరికి ఒక్కో ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. దీంతో ఒక్కరిని మరోకరితో పోలచలేని పరిస్దితి.  సుమ,అనసూయ,రేష్మి,శ్రీముఖి,వర్షిణి,విష్ణు ప్రియ..ఇలా ప్రతి ఒక్కరికి ఓ సపరెట్ స్టైల్ ఉంటుంది. తెలుగు బుల్లితెర యాంకర్ ల లో చాలామంది గ్లామర‌సాన్నీ బాగా నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే వ‌ర్థ‌మాన యాంక‌ర్‌ భీమినేని విష్ణుప్రియ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. విష్ణుప్రియ అనసూయ, శ్రీముఖి, ర‌ష్మీని మించిన రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ ఉండడంతో ఇటీవల యువతలో ఆమెకు మంచి క్రేజ్ వచ్చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర కారును గిలిగింత‌లు పెడుతూనే ఉంటుంది. విష్ణు ప్రియ యాంకర్ కావడానికి ముందు తెలుగు – కన్నడం – తమిళం – మలయాళ భాషల్లో పలు వెబ్ సీరిస్‌ల‌లో నటించింది తెలుగులో బుల్లితెరపై అడుగుపెట్టాక తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకుంది. విష్ణు ప్రియ సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అయ్యేవారికి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో ఆమె అందాల విందు చేస్తూనే ఉంటుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో విష్ణు ప్రియ పలు ప్రొడక్ట్ లను, ప్రముఖ బ్రాండ్లను బాగా ప్రమోట్ చేసి.. భారీ ఆదాయానే వెనకేసుకుంటుంది.

ఇక ఆమె ఓయో రూంస్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాల్లో ఓయో రూమ్స్ హవా నడుస్తోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ట్రావెలర్స్ ఇక్కడ సేద తీరుతుంటారు. అయితే గతంలో ఓ సారి ఈ ఓయో రూమ్స్ గురించి ప్రస్తావిస్తూ ఇవి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పిన విష్ణు ప్రియ.. మరోసారి అదే రకమైన పోస్ట్ పెట్టి ఓయో రూమ్స్ స్పెషాలిటీస్ వివరిస్తూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో లు కూడా పోస్ట్ చేసింది.

ఇక ఆ వీడియోలో “నేను మొదటి సారి ఓయో రూమ్ లోకి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇక ఆ బెడ్స్ అయితే ఎంత మెత్తగా ఉంటాయో. నేను ఫుల్ శాటిస్‌ఫై. నేను మళ్లీ నా పనులు మొదలుపెట్టి షెడ్యూల్ చేసుకునే ముందే నేను ఓయో రూంను బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాను”..అంతూ పోస్ట్లు పెడుతుంది ఈ భామ. ఏదిఏమైనా విష్ణు అటు సినిమాల్లోను ఇటు పలు బ్రాంద్స్ ప్రమోట్ చేయడం వల్ల బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news