Moviesపుష్పలో నన్ను చాలా తక్కువగా చూపించారు..ఓపెన్ అప్ అయిన అనసూయ..!!

పుష్పలో నన్ను చాలా తక్కువగా చూపించారు..ఓపెన్ అప్ అయిన అనసూయ..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం పుష్ప ది రైజ్. స్కై రేంజ్ అంచ‌నాల‌తో శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా శేషాచ‌లం అడ‌వుల్లోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. రెండు భాగాలుగా భారీ రేంజ్‌లో ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ముందే ప్రకటించిన సుకుమార్.. అందులో తొలి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో ప్రేక్షకుల ముందుంచారు. భారీ హైప్ మ‌ధ్య‌లో రిలీజ్ అయ్యిన అల్లు అర్జున్ పుష్ప బాక్స్ ఆఫిస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది.

నిజానికి ఈ పుష్ప సినిమా వ‌ర్క్ కొంత పెండింగ్‌లో ఉండ‌డం, సుకుమార్ అన్ని ప‌ట్టి ప‌ట్టి చూస్తుండ‌డంతో అస‌లు ఈ నెల 17న అయినా పుష్ప థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. వాటిని ప‌టాపంచ‌లు చేస్తూ పుష్ప థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. బ‌న్నీ కెరీర్‌లో ఫ‌స్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన పుష్ప ఐదు భాష‌ల్లో ఏకంగా 3 వేల‌కు పైగా స్క్రీన్ల‌లో రిలీజ్ అయ్యింది. ఇక పుష్ప సినిమా అభిమానులకు బాగా రీచ్ అయ్యింది. బ‌న్నీ కెరీర్‌లో ఫ‌స్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన పుష్ప‌కు రిలీజ్‌కు ముందే రు. 145 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. దీనికి తోడు పుష్ప రిలీజ్‌కు రెండు రోజుల ముందే ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వ‌డంతో పుష్ప‌కు కాస్త ప్ల‌స్ అయ్యింది.

ఇక పుష్ప బ‌న్నీ కెరీర్‌లో ఫ‌స్ట్ పాన్ ఇండియా సినిమా కావ‌డంతో పాటు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంతో పాటు నార్త్‌లో హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా కూడా ముందు నుంచి ఉన్న హైప్‌తో అదిరిపోయే వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ కావడంతో పుష్ప టీ పలు చోట్ల సక్సెస్ మీట్లు ఏర్పాటులు చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో పుష్ప సక్సెస్ మీట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫంక్షన్ కి చిత్ర బృందం అందరు అటెండ్ అయ్యారు. బన్నీ,సుకుమార్,రష్మిక,అనసూయా..బాగా సందడి చేసారు.

ఈ క్రమంలో అనసూయ మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..” ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించి చాలా చెప్పాలి అనుకున్నాను కానీ మా నాన్నగారు చనిపోవడం వల్ల ఆ బాధలో ఉండిపోయాను. ఆ బాధలో ఉండి ఇంటర్వ్యూలకు రాలేకపోయాను. అందుకే ఇక్కడ ఈ రోజు చెప్తున్నా.. నా లైఫ్‌లో బన్నీ ఎంత ఇంపార్టెంటో మీకు ఎవ్వరికి తెలీదు. మీది చాలా పెద్ద మనసు. అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా మీరు ఇన్‌స్పిరేషన్‌. ఇక ఈ సినిమాలో మీ పర్ ఫామెన్స్ కేక చించేసారు. అస్సలు తగ్గెదేలే.. సుకుమార్ సార్ అందరితోపాటు నాది కూడా ఓ కంప్లైంట్‌ ఉంది. ఏంటంటే? పుష్పలో నన్ను చాలా తక్కువగా చూపించారు. రెండో భాగంలో మాత్రం నేనే చక్రం తిప్పుతా’ అని చెప్పుకొచ్చింది అనసూయ.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news