Moviesవ్య‌భిచారం కేసులో అడ్డంగా బుక్ అయిన టాలీవుడ్ మ‌హిళా నిర్మాత‌..!

వ్య‌భిచారం కేసులో అడ్డంగా బుక్ అయిన టాలీవుడ్ మ‌హిళా నిర్మాత‌..!

సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి పోవాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చేవారు సరైన అవకాశాలు లేకపోవడంతో పక్కదారి పడుతూంటారు. డబ్బు సంపాదన కోసం దిగజారి ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం తమకు ఉన్న గ్లామర్‌ను క్యాష్ చేసుకునేందుకు మరింత డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలు అవలంబిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన ఓ మహిళా సినీ నిర్మాత కూడా డబ్బులు సంపాదించేందుకు అక్రమ మార్గం ఎంచుకుంది.

ప‌డుపు వృత్తిని ఆదాయ మార్గంగా ఎంచుకుని… అభంశుభం తెలియని ఒక చిన్నారిని బలవంతంగా ఈ వృత్తిలోకి దింపింది. 13 ఏళ్ల బాలికతో వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కింది. ఆ మహిళా నిర్మాత పోలీసులకు చిక్కినా కూడా ఆ మృగాళ్లు ఆ మైనర్ బాలికను వదలకుండా ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించారు. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికతో వ్యభిచారం చేయిస్తున్న కేసులో మ‌హిళా సినీ నిర్మాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులోని స్వర్ణ భారతి నగర్ కు చెందిన సదరు నిర్మాత కొన్ని సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఆ మ‌హిళ బాలికను బెదిరించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్టు తేలింది. అయితే బాధిత బాలిక ఆ మ‌హిళ నుంచి తప్పించుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇక బాధిత బాలిక ఓ మాజీ ఎంపీకి బంధువ‌ని తెలుస్తోంది. బాలిక‌ను ర‌క్షించిన గుంటూరు పోలీసులు ఆమెను వైద్యం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఇక ఇటీవ‌ల గుంటూరులో తర‌చుగా వ్య‌భిచారం కేసులు వెలుగు చూస్తున్నాయి. బంగ్లాదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్క‌డ వ్య‌భిచారం చేయిస్తున్నారు. ఇక స‌ద‌రు మ‌హిళా నిర్మాత వ్య‌భిచారం చేయిస్తుండ‌డంతో ఆమె వెన‌క ఎవ‌రైనా ఉన్నారా ? అన్న కోణంలో కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news