Moviesభీమ్లా నాయ‌క్ ' ర‌న్ టైం లాక్.. ఎన్ని నిమిషాలు అంటే..!

భీమ్లా నాయ‌క్ ‘ ర‌న్ టైం లాక్.. ఎన్ని నిమిషాలు అంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న భీమ్లా నాయ‌క్ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ వి.చంద్ర తెర‌కెక్కించిన ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌ల‌తో పాటు స్క్రీన్ ప్లే అందించారు.

రానా ద‌గ్గుబాటితో క‌లిపి ప‌వ‌న్ చేస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ సినిమా కావడంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. నిత్యామీన‌న్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ప‌లు సందేహాలు వ‌స్తున్నా కూడా నిర్మాత‌లు మాత్రం ఖ‌చ్చితంగా త‌మ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12నే రిలీజ్ చేస్తామ‌ని క్లారిటీ ఇస్తున్నారు.

ఇక రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా స్పీడ్‌గా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ర‌న్ టైం కూడా లాక్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. సినిమాలో ఐటెం సాంగ్స్‌, డ్యూయెట్స్ కూడా లేక‌పోవడంతో ర‌న్ టైం చాలా క్రిస్పీగా ఉంద‌ని అంటున్నారు. టోట‌ల్‌గా భీమ్లా నాయ‌క్ ర‌న్ టైం 2.20 గంట‌లుగా తెలుస్తోంది. ఇంత త‌క్కువ ర‌న్ టైం ఉంటే సినిమా ఏ మాత్రం ల్యాగ్ లేకుండా చాలా క్రిస్పీగా స్పీడ్‌గా ముందుకు మూవ్ అవుతుంద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news