Moviesప్ర‌భాస్ అడ‌విరాముడు సినిమా టైటిల్ వెన‌క ఇంత క‌థ ఉందా..!

ప్ర‌భాస్ అడ‌విరాముడు సినిమా టైటిల్ వెన‌క ఇంత క‌థ ఉందా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. బాహుబలి 1,2.. ఈ రెండు సినిమాలతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్ర‌భాస్ పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం నటిస్తున్న ఆదిపురుష్‌, రాధేశ్యామ్ సినిమాలు సైతం పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రభాస్ సీనియర్ స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్లో అడవిరాముడు సినిమా వచ్చింది. 2004 లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ పక్కన ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో అలనాటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఆరేసుకోబోయి పారేసుకున్నాను సాంగ్ రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ఆ సినిమాకే హైలెట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు అడవి రాముడు టైటిల్ పెట్టడం వెనక ఉన్న ఆసక్తికర విషయాన్ని బి.గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అడవి రాముడు షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోందట. ఈ సినిమా నిర్మాత, ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల ఆరేసుకోబోయి పారేసుకున్న పాటను సరదాగా వాడుతున్నారట.

అదే టైంలో బి.గోపాల్ ఒక సీన్ కు సంబంధించి డిస్కషన్ చేస్తున్నారట. వెంటనే చంటి పాటను విన్న బి.గోపాల్ కు మదిలో ఒక్కసారిగా ఈ పాటను ఆ సినిమాలో రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందట. వెంటనే ఆ విషయాన్ని నిర్మాత చంటికి చెప్పడం.. ఆయ‌న‌ కూడా సూపర్ అనటం జరిగిపోయాయట.

ఆ తర్వాత గోపాల్ తన గురువు అయిన రాఘవేంద్రరావును కలిసి గురువు గారు ఈ పాటను రీమిక్స్ చేస్తున్నామని విజ్ఞప్తి చేయగా… అందుకు రాఘవేంద్రరావు వెంటనే ఓకే చెప్పారట. ఆ పాటను రీమిక్స్ చేయాలన్న ఆలోచన వచ్చిన తర్వాత ఆ సినిమాకు అడవి రాముడు టైటిల్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు గోపాల్ వెల్లడించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news