Moviesఆ స్టార్ హీరో క‌ప‌ట ప్రేమ‌కు మోస‌పోయిన భార్య‌... భ‌ర్త‌ను వ‌దిలేసి...

ఆ స్టార్ హీరో క‌ప‌ట ప్రేమ‌కు మోస‌పోయిన భార్య‌… భ‌ర్త‌ను వ‌దిలేసి మ‌రీ…!

సినిమా ఇండ‌స్ట్రీ అనేది పెద్ద రంగుల ప్ర‌పంచం. ఇక్క‌డ హీరోల‌కు వ‌చ్చిన ఇబ్బంది ఉండ‌దు. హీరోయిన్లు మాత్రం ఎప్పుడు ఎవ‌రితో క‌లిసి ఉంటారో ? విడిపోతారో ? తెలియ‌దు. హీరోయిన్లు అవ‌కాశాల కోసం కావ‌చ్చు.. ఇత‌ర కార‌ణాలు కావ‌చ్చు.. మ‌గాళ్ల‌ను స‌లువుగా న‌మ్మేస్తూ మోస‌పోతూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఓ కోలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ సైతం పెళ్ల‌య్యి భ‌ర్త ఉన్నా కూడా ఓ స్టార్ హీరో త‌న‌పై చూపించిన క‌ప‌ట ప్రేమ‌ను న‌మ్మి మోస‌పోయింది.

త‌మిళ‌నాడు సీనియ‌ర్ హీరో, మాజీ ముఖ్య‌మంత్రి ఎంజీ. రాంచంద్ర‌న్ మూడో భార్య జాన‌కీ రామ‌చంద్ర‌న్ గురించి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ఎంపీ రామ‌చంద్ర‌న్ ఇద్ద‌రు భార్య‌లు అప్ప‌టికే మృతి చెందారు. ఇక జాన‌కికీ గ‌ణేష్ భ‌ట్ అనే వ్య‌క్తితో అప్ప‌టికే పెళ్లి అయ్యింది. గ‌ణేష్ ఎవ‌రో కాదు ఎంజీఆర్‌కు మేక‌ప్‌మేన్‌. జాన‌కీ చాలా అందంగా ఉంటుంది. ఆమెపై క‌న్నేసిన ఎంజీఆర్ ఆమెతో ఎంతో స‌న్నిహితంగా ఉంటూ ఆమెపై ప్రేమ చూపించారు. అయితే అదంతా క‌ప‌ట ప్రేమ అన్న విష‌యం ఆమె గుర్తించ లేదు.

చివ‌ర‌కు ఆమెను భ‌ర్త‌ను వ‌దిలేసి ఎంజీఆర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత ఎంజీఆర్ జాన‌కీకి న‌ర‌కం చూపించాడు. ఆమెతో పిల్ల‌ల‌ను క‌నేందుకు కూడా ఇష్ట‌ప‌డేవారు కాదు. అయితే ఎంజీఆర్‌కు మాత్రం ఆమె ఎన్నో స‌ప‌ర్య‌లు చేసింది. ఆయ‌న ప్ర‌మాదానికి గునైన‌ప్పుడు కూడా ఎంతో సేవ చేసింది. జాన‌కీని పెళ్లి చేసుకున్నాక ఎంజీఆర్ జ‌య‌ల‌లిత‌తో ఎఫైర్ పెట్టుకున్నారు.

ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. రాజ‌కీయాల్లో జ‌నాక‌ర్ష‌ణ‌కు ఎంజీఆర్ జాన‌కీ ప‌నికిరాద‌ని భావించి.. ఆమెను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తూ జ‌య‌ల‌లిత మోజులో పూర్తిగా ప‌డిపోయారు. అలా జ‌న‌కీ రామ‌చంద్ర‌న్ పేరుకు మాత్ర‌మే ఎంజీఆర్ భార్య‌గా ఉన్నా ఆమెను ఆయ‌న ఏనాడు ప‌ట్టించుకోలేదు. త‌న‌ను ఎంత‌గానో ప్రేమించే భ‌ర్త‌ను వ‌దులుకుని మ‌రీ వ‌చ్చిన జాన‌కీ దారుణంగా మోస‌పోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news