Moviesచైతూ అంటే సమంతకి ఇంత కోపమా..చివరికి అది కూడా చెయ్యలేదే..!!

చైతూ అంటే సమంతకి ఇంత కోపమా..చివరికి అది కూడా చెయ్యలేదే..!!

సమంత నాగచైతన్య..కలిసి ఉన్నప్పుడు మీడియాలో హైలెట్ గా నిలిచారు. విడిపోయినాప్పుడు కూడా కూడా మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంటా..ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. నాగ చైతన్య ఇంటికి దూరంగా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఇక సమంత కూడా విడాకుల నాగ చైతన్యతో గడిన అదే ఇంట్లో ఉంటూ..విడాకుల విషయం నుండి బయటపడడానికి వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది.

సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత తన పని తాను చేసుకుంటూపోతుంది. ఇక రీసెంట్ గా ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యిపోయింది. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప మూవీలో అమ్మడు ఓ ఐటెం సాంగ్ చేయనుంది. దీని పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ విషయాలు పక్కన పెడితే..ఇప్పుడు సమంత చేసిన ఓ పని నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దీంటో ఆమెకు నాగచైతన్య అంటే ఎంత కోపం ఉందో తెలిసిపోయింది అంటున్నారు నెటిజన్స్.

నవంబర్ 23న నాగ చైతన్య పుట్టిన రోజు. ఆయన బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ఇండస్ట్రీ నుంచి ఫ్రెండ్స్ నుండి కూడా ప్రముఖులు చైతూకి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, తన మాజీ భార్య సమంత మాత్రం ఆయనకు విష్ చేయలేదు. ఎంతో మంది అభిమానులు ఎప్పటి నుందో ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుతుందా లేదా ఆశ‌గా ఎదురు చూశారు. కానీ అమ్మడు చైతూకి విషేస్ చెప్పలేదు. విడిపోయినా మేం ఫ్రెండ్స్ గా ఉంటాం అని చెప్పిన సమంత కనీసం చైతూ బర్త డేకి కూడా విషేస్ చెప్పలేదు అంటే ఆయన మీద ఎంత కోపం గా ఉందో అంతూ అభిమానులు చర్చించుకుంటున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news