Moviesనాటు నాటు’స్టెప్స్‌ కోసం తారక్-చరణ్ ఎన్ని టేక్స్‌ తీసుకున్నారో తెలుసా..!!

నాటు నాటు’స్టెప్స్‌ కోసం తారక్-చరణ్ ఎన్ని టేక్స్‌ తీసుకున్నారో తెలుసా..!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. గోండు వీరుడు కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. ఇద్ద‌రు యోధుల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ క‌థతో 1940 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం. నాలుగు వంద‌ల కోట్ల‌కు పై బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది.

టాలీవుడ్‌లోనే ఇద్ద‌రు క్రేజీ యంగ్‌స్ట‌ర్స్ అయిన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారిగా క‌లిసి తెర‌పై స్క్రీన్ షేర్ చేసుకోవ‌డంతో ఆర్ ఆర్ ఆర్ పై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక ఇప్ప‌టికే రిలీజ్ గ్లింప్స్‌తో పాటు ప్రోమోలు సినిమాపై అంచ‌నాలు ఆకాశానికి పెంచేశాయి. తాజాగా రీలీజ్ అయిన నాటు నాటు పాట సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఓ ఊపు ఊపేసింది. ట్రిపుల్ ఆర్ లో ఊర నాటు సాంగ్‌గా వైర‌ల్ అవుతోన్న ఈ నాటు సాంగ్ డ్యాన్స్ కూడా మ‌రీ నాటుగా ఉంది. 3.28 నిమిషాల పాటు ఉన్న సాంగ్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ క‌లిసి వేస్తోన్న డ్యాన్సులు అయితే మ‌రీ ఊర‌నాటుగా హోరెత్తించేస్తున్నాయి. ఇద్ద‌రూ కూడా రెచ్చిపోయి మ‌రీ డ్యాన్సులు వేశారు.

కాగా, ఈ పాట తెర పై చూడటానికి ఎంతో అందంగా ఉంది. కానీ ఈ పాట ఇంతలా మంచిగా రావడానికి చెర్రీ, తారక్‌లు చాలా కష్టపడ్డారట. పాటలో కాళ్లను ఎడమవైపు, కుడివైపుతో పాటు ముందు, వెనుకకు కదుపుతూ ఉండే స్టెప్మ్ కోసం చాలా ఇబ్బందులు పడ్డారట. ఈ స్టెప్‌ ఫర్ఫెక్ట్‌గా సింక్‌ అయ్యేందుకు తారక్‌, చెర్రీ ఏకంగా 15-18 టేక్స్‌ తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆరే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఇక ఆ పాటలో స్టెప్స్‌ సరిగా రావడం కోసం రాజమౌళి అయితే తమకు నరకం చూపించాడట. అయితే పాట విడుదలైన తర్వాత తమ స్టెప్పులపై అందరు పొగుడుతూ ఉంటే.. మేం పడిన కష్టం మరిచిపోయామని తెలిపారు తారక్. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news