Moviesఅలా చేసి తప్పు చేసిన పూజా హెగ్డే..సమంత ఎంత లక్కి అంటే..?

అలా చేసి తప్పు చేసిన పూజా హెగ్డే..సమంత ఎంత లక్కి అంటే..?

పూజా హెగ్డే.. టాలివుడ్ బుట్టబోమ్మ. ముకుంద అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ.. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకుంది. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని మరో అనుమానం లేకుండా చెప్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తర్వాత గేర్ మార్చింది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది.

అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి.వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా పూజాహెగ్డే ఓ మంచి ఆఫర్ వదిలేసుకుందట. ఆ ఆఫర్ ను సమంత దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ చేస్తున్నప్పుడే త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యడు. కమిట్ అయ్యి అఫిషియల్ గా ప్రక్టించారు. మహేశ్‌ బర్త్‌డే సందర్భంగా తివిక్రమ్‌ టీం #శ్శంభ్28 పేరుతో ఈ మూవీపై అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా ఈ చిత్రంలో మహేశ్‌కు జోడిగా పూజ హెగ్డేను అనుకున్నారట చిత్ర బృందం.

కానీ పూజా కున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నిందట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. పూజ వదులుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ కు సమంతను హీరోయిన్ గా ఫైల్ చేసారట. అమ్మడు కూడా ఇందుకు ఓకే చెప్పిన్నట్లు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో అఫిషియల్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ వస్తెస్ రిజెక్ట్ చేసి తప్పు చేసింది పూజా అని అంటున్నారు నెటిజెన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news