Moviesఎట్టకేలకు అన్న‌పూర్ణ స్డూడియోస్ లో అడుగుపెట్టిన సమంత..అందుకోసమేనట..?

ఎట్టకేలకు అన్న‌పూర్ణ స్డూడియోస్ లో అడుగుపెట్టిన సమంత..అందుకోసమేనట..?

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత ..అస్సలు అక్కినేని కుటుంబం గురిచి కానీ, చై గురించి కానీ ఎక్కడ మాట్లాడటం లేదు. ప్రతి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక్క పోస్ట్ పెడుతూ వచ్చే ఈ అమ్మడు కనీసం నాగచైతన్య పుట్టిన రోజు కి కూడా విష్ చేయలేదు. పోనీ బిజీగా ఉండి విష్ చేయలేదా అనుకుంటే అది లేదు. తన కుక్కకి మాత్రం పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. కానీ మాజీ మొగుడికి విష్ కూడా చేయలేదు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు సమంతకు నాగ చైతన్య అంటే ఎంత కోపం ఉందో.

విడాకుల తరువాత తన పనీ తాను చేసుకుంటూ పోతున్న సమంత..నాగ్ కుటుంబాని దూరం పెట్టింది. చివరకు అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం హిట్ అయినా కూడా కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. ఒక్కపూడు అఖిల్ సమంత ఎంతో మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారో మనం చూసాం. కానీ విడాకుల తరువాత అన్నీ బంధాలు తెగిపోయాయి. రిలేషన్ షిప్స్ మారిపోయాయి. కాగా, ఎట్టకేలకు విడాకుల తరువాత ఫస్ట్ టైం అక్కినేని నాగార్జున హోం బ్యాన‌ర్ అయిన అన్న‌పూర్ణ స్డూడియోస్ లో స‌మంత అడుగుపెట్టిందట.

యస్..సడెన్ గా అన్న‌పూర్ణ స్డూడియోస్ లో సమంత ప్ర‌త్యక్ష‌మైంద‌న్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంత‌కీ సమంత అన్న‌పూర్ణ స్డూడియోలోకి ఎందుకు వచ్చారో తెలుసా..? గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శాకుంత‌లం సినిమాలో లీడ్ రోల్ లో నటించింది సమంత. ఈ సినిమా డ‌బ్బింగ్ కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో ప్ర‌త్యక్ష‌మైన‌ట్టు టాలీవుడ్ స‌ర్కిల్ లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి సామ్ ఇలా విడాకుల త‌ర్వాత మొద‌టిసారి స్టూడియోకు రావ‌డంపై అంద‌రూ తెగ చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news