Moviesబాల‌య్య టాక్‌షోలో మోక్ష‌జ్ఞ... ఈ షోలోనే ఫ్యీజులు ఎగిరే న్యూస్‌..!

బాల‌య్య టాక్‌షోలో మోక్ష‌జ్ఞ… ఈ షోలోనే ఫ్యీజులు ఎగిరే న్యూస్‌..!

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మూడో త‌రంలో కూడా హీరోలు వ‌చ్చేశారు. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోలుగా కొన‌సాగుతున్నారు. ఈ వంశం నుంచే నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ కూడా త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ మూడేళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే అవి ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. బాల‌య్య 2017లో న‌టించిన త‌న 100వ సినిమా గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో మోక్ష‌జ్ఞ వ‌శిష్టిపుత్ర పులోమావిగా న‌టిస్తాడ‌న్న ప్ర‌చారం జ‌రిగినా కార్య‌రూపం దాల్చ‌లేదు.

త‌ర్వాత వారాహి చల‌న‌చిత్రం బ్యాన‌ర్లో సాయి కొర్ర‌పాటి నిర్మాత‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో మోక్షు డెబ్యూ మూవీ ఉంటుంద‌ని ప్ర‌చారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది జ‌ర‌గ‌లేదు. మ‌రోవైపు నంద‌మూరి అభిమానుల్లో మాత్రం మోక్షు డెబ్యూ సినిమా ఎప్పుడు ఉంటుందా ? అన్న క్యూరియాసిటీ మాత్రం ఒక్క‌టే పెరిగిపోతోంది. అయితే ఓ ఇంట్ర‌స్టింగ్ నుంచి వ‌చ్చేసింది. బాల‌య్య ఆహా ఓటీటీ లో చేస్తోన్న టాక్ షోలో మోక్ష‌జ్ఞ రాబోతున్నాడు.

అల్లు అర‌వింద్ ఆహా ఓటీటీలో ప‌లువురు సెల‌బ్రిటీల‌ను బాల‌య్య ఇంట‌ర్వ్యూ చేస్తున్నాడు. ఈ అన్‌స్టాప‌బుల్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ టాక్ షోలో మోక్ష‌జ్ఞ కూడా సంద‌డి చేయ‌బోతున్నాడ‌ట‌. షోకు అదిరిపోయే క్రేజ్ తీసుకువ‌చ్చేందుకే మోక్ష‌జ్ఞ‌ను రంగంలోకి దింపుతున్న‌ట్టు టాక్ ? ఇక ఈ షోలో నే మోక్షు డెబ్యూ గురించి బాల‌య్యే స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది.

అదే జ‌రిగితే నంద‌మూరి ఫ్యాన్స్‌కు ఫ్యీజులు ఎరిగిపోయే న్యూస్ ఇదే అని చెప్పాలి. ఇక మోక్షు ఇప్ప‌టికే అమెరికాలో న‌ట‌న‌తో పాటు డ్యాన్సుల్లో శిక్ష‌ణ పొందుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news