Newsపెళ్లైన మ‌గాడితో ప్రేమ‌లో ప‌డితే అది అక్క‌ర్లేదా.. సీనియ‌ర్ హీరోయిన్ స‌ల‌హా..?

పెళ్లైన మ‌గాడితో ప్రేమ‌లో ప‌డితే అది అక్క‌ర్లేదా.. సీనియ‌ర్ హీరోయిన్ స‌ల‌హా..?

సినిమా ఇండ‌స్ట్రీలో టాప్ పొజిష‌న్‌కు చేరుకున్నాక వారికి సెల‌బ్రిటీలుగా ఓ హోదా ఉంటుంది. అయితే వీరు త‌మ కెరీర్ స్టార్టింగ్‌లో ప‌డిన ఇబ్బందులు, బాధ‌ల‌ను త‌ర్వాత మ‌న‌సు విప్పి పంచుకుంటూ ఉంటారు. తాము ప‌డిన బాధ‌లు మ‌రెవ్వ‌రు ప‌డ‌కూడ‌ద‌ని స‌ల‌హాలు ఇస్తూ ఉంటారు. ఇంత‌కు ఆమె ఎవ‌రో కాదు బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి, టెలివిజ‌న్ న‌టి నీనా గుప్తా. నీనా కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు. ఓ ద‌ర్శ‌కురాలు.. నిర్మాత కూడా…! ఆమె న‌ట‌న‌కు అప్ప‌ట్లో నార్త్ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయేవారు. అప్ప‌ట్లో కుర్ర‌కారు త‌ల తిప్పుకోలేనంత అందం ఆమె సొంతం.

 

ఆమె ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇక సినిమాల్లోనే కాకుండా బుల్లి తెర‌పై ఎన్నో షోలు చేసిన నీనా కు బుల్లి తెర‌పై కూడా ల‌క్షలాది మంది ప్రేక్ష‌కులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఓ పుస్త‌కంలో చ‌దువుకున్న ఓ వ్యాఖ్యాన్ని ఇన్ స్టా వేదిక‌గా పంచుకుంది. పెళ్లి అయిన మ‌గాడితో ప్రేమ‌లో ప‌డితే క‌ళ్ల‌కు మ‌స్కారా పెట్టుకోవ‌ద్దు అని .. ఈ లైన్ చాలా బాగుంది. క‌దా.. నేను ఏం చెపుతున్నానో ఇప్ప‌టికే మీకు అర్థ‌మై ఉంటుంద‌నుకుంటా ? అని చెప్పింది.

దీంతో చాలా మంది నెటిజ‌న్లు పెళ్ల‌యిన మ‌గాడిని ప్రేమిస్తే మిగిలేది క‌న్నీళ్లే అంటూ ఆమెకు రిప్లై ఇస్తున్నారు. ఈమె కూడా గ‌తంలో అప్ప‌ట్లో స్టార్ క్రికెట‌ర్‌గా ఉన్న విండీస్ ఆట‌గాడు వివ్ రిచ‌ర్డ్స్‌ను ప్రేమించింది. అయితే అప్ప‌టికే అత‌డికే పెళ్ల‌య్యింది. అయినా కూడా అత‌డితో ఓ ఆడ పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అలా నీనా గుప్తా జీవితం రిచ‌ర్డ్స్‌ను నమ్మ‌డంతో చీక‌టి మ‌యం అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news