Moviesబిగ్‌బాస్ ఉమాదేవి కూతురును చూస్తే మ‌తులు పోవాల్సిందే..!

బిగ్‌బాస్ ఉమాదేవి కూతురును చూస్తే మ‌తులు పోవాల్సిందే..!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఉమాదేవి ఎంత పాపుల‌ర్లో ఇప్పుడు బిగ్‌బాస్ షోలోకి వ‌చ్చాక ఆమెకు ఉన్న పాపులారిటీ డ‌బుల్ అయ్యింది. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో చాలా యేళ్ల నుంచి కొన‌సాగుతోన్న ఉమాదేవి ఇప్పుడు బిగ్ బాస్ షోలో త‌న అందంతో పాటు ఆట‌తో కూడా ఆక‌ట్టుకుంది. అయితే ఆమె ఎన్నో సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చేసినా రాని పేరు ప్ర‌ఖ్యాతులు ఒక్క కార్తీక‌దీపం సీరియ‌ల్‌తో పాటు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ద్వారానే వ‌చ్చాయి.

కార్తీక దీపం సీరియ‌ల్లో ఉమా దేవి హీరోయిన్ దీప బంధువు పాత్ర‌లో న‌టించి త‌నదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఉమా దేవి బొద్దుగా ఉన్నా.. ఆంటీ వ‌య‌స్సులో ఉన్నా కూడా ఇప్పుడు ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువుగా ఉండ‌డం విశేష‌మే. ఉమా దేవి త‌న ఫ్యామిలీ స‌భ్యుల గురించి ఎప్పుడూ బ‌య‌ట చెప్ప‌లేదు. అయితే ఇటీవ‌ల ఆమె త‌న కుమార్తెతో క‌లిసి ప‌లు ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది.

ఉమాదేవి కూతురు పేరు యాగంటి అనూష‌. ఆమె ఇప్పుడే చ‌దువు కంప్లీట్ చేసుకుని డ్యాన్స్‌లో శిక్ష‌ణ తీసుకుంటోంద‌ట‌. ఇక సోష‌ల్ మీడియాలో ఉమా కూతురు అనూష‌కు కూడా మంచి క్రేజ్ ఉంది. అనూష‌కు ఇన్ స్టాలో 5 వేల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. కొంద‌రు నెటిజ‌న్లు అయితే అనూష చాలా అందంగా ఉంద‌ని.. ఆమె సినిమాల్లో హీరోయిన్‌గా ట్రై చేస్తే మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని చెపుతున్నారు.

మ‌రి అనూష త‌ల్లిని ఫాలో అవుతూ ఈ రంగుల ప్ర‌పంచంలోకి వ‌స్తుందా ? లేదా ఇత‌ర రంగాల్లోకి వెళుతుందా ? అన్న‌ది చూడాలి. ఏదేమైనా ఉమాదేవికి త‌గ్గ కూతురురా బాబు అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news