Moviesకార్తీకదీపం హిమ‌, సౌర్య రెమ్యున‌రేష‌న్ చూస్తే మైండ్ బ్లాకే బ్లాకు...!

కార్తీకదీపం హిమ‌, సౌర్య రెమ్యున‌రేష‌న్ చూస్తే మైండ్ బ్లాకే బ్లాకు…!

తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్, ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, మరెన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతున్న కూడా అవి కార్తీకదీపం సీరియ‌ల్ ద‌రిదాపుల‌కు కూడా రావడం లేదు. నెలలకు నెలలుగా కార్తీకదీపం టిఆర్పి రేటింగ్‌ల‌లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. విచిత్రం ఏంటంటే రెండో స్థానంలో ఉన్న‌ సీరియల్ కూడా కార్తీకదీపం దరిదాపుల్లో కూడా ఉండటం లేదు. తెలుగు బుల్లి తెర‌పై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు, మ‌రో వైపు కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌లు ఉన్నా కూడా అవి కార్తీకదీపం టీఆర్పీ రేటింగుల ముందు తేలిపోతున్నాయి.

కార్తీక‌దీపంను ఢీకొట్టేందుకు వ‌చ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా క‌నీసం పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీరియల్లో డాక్టర్ బాబు, దీప‌ పాత్రల‌కు ఎంతో క్రేజ్ వచ్చేసింది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క, డాక్టర్ బాబులకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ ఇంత హిట్ అవ్వడానికి వీరిద్దరితో పాటు సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తున్న హిమ‌, సౌర్య కూడా కారణం. ఈ రెండు పాత్రలకు కూడా సీరియల్ లో కీలకమైన ప్రాధాన్యం ఉంది.

కార్తీక్‌, దీప ఎందుకు విడిపోయారంటూ వీరు అమాయ‌కంగా అడిగే ప్ర‌శ్న‌లు ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. చాలా చిన్న వ‌య‌స్సులోనే ఈ ఇద్ద‌రికి ఇంత క్రేజ్ రావ‌డం మామూలు విష‌యం కాదు. పైగా హిమ న‌లుపు రంగులో న‌టించేందుకు ఒప్పుకోవ‌డం విశేషం. మ‌రి వీరి పాత్ర‌ల‌కు ఎంత డిమాండ్ ఉందో.. వీరి రెమ్యున‌రేష‌న్ కూడా అంతే స్థాయిలో ఉంద‌ట‌. వీరు ఒక్క రోజు షూటింగ్ చేసినందుకు గాను రోజుకు రు. 7 వేలు ఇస్తున్నార‌ట‌. ఇంత త‌క్క‌వ వ‌య‌స్సులోనే వీరికి రోజుకు రు. 7 వేలు అంటే.. భ‌విష్య‌త్తులో వీరికి మ‌రింత డిమాండ్ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news