Moviesసమంత టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..? చేతిలో ఒక్క సినిమా...

సమంత టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..? చేతిలో ఒక్క సినిమా లేకపోయినా బాగానే సంపాదించేసిందే..!

సమంత .. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న పేరు . ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . మరీ ముఖ్యంగా జెస్సి పాత్రలో సమంతని తప్పిస్తే మిగతా వేరే ఏ హీరోయిన్ ని ఊహించుకోలేకపోయారు జనాలు . అంతలా ఆ పాత్రలో లీనమైపోయినటించి ఫస్ట్ సినిమాలోనే లిప్ కిస్సులతో రెచ్చిపోయింది . ఆ తర్వాత సమంత కెరియర్ ఎలా జెట్ స్పీడ్ లో ముందుకు ట్రెండ్ అయిపోయిందో మనం చూసాం.

కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత విడాకులు ఇచ్చేసింది . ఆ తర్వాత సింగిల్గానే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు సమంత పేరు పై ఉన్న టోటల్ ఆస్తి డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ప్రజెంట్ సమంత టోటల్ ఆస్తి 127 కోట్లకు పైగానే ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది . తల్లిదండ్రుల నుంచి ఆస్తి పెద్దగా ఏమీ రాలేదు. వాళ్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.

అదే విధంగా అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒక్క రూపాయి కూడా భరణం డిమాండ్ చేయలేదు . అయితే విడాకులు తర్వాత సమంత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలలో కూడా నటించలేదు . మరి ఆమె పేరుపై ఇంత ఆస్తి ఎలా వచ్చింది.. అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సమంతకు ఇంత ఆస్తి ఎలా వచ్చింది? సమంత నిజంగానే ఇదంతా కష్టపడి సంపాదించిందా ..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు . అయితే సమంత సినిమాలో నటించకపోయిన పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసింది అని .. ఆ ప్రోడక్ట్ ద్వారానే ఆమె మంచిగా డబ్బులు సంపాదించింది అని .. అదే విధంగా ఆమె పలు బిజినెస్ల్లో కూడా పెట్టుబడులు పెట్టింది అని .. ఆ డబ్బులు ద్వారానే ఈ ఆస్తి సంపాదించుకుంది అని చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ సమంతకు సంబంధించిన ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news