Moviesదాసరిని రాళ్లతో కొట్టాలి అనుకున్న ఆ స్టార్ హీరో .. ఎందుకో...

దాసరిని రాళ్లతో కొట్టాలి అనుకున్న ఆ స్టార్ హీరో .. ఎందుకో తెలుసా..?

సినీ ఇండస్ట్రీకి చాలా మంది డైరెక్టర్స్ వస్తుంటారు పోతుంటారు. కానీ వాళ్ళలో అతి కొద్ది మంది మాత్రమే ప్రేక్షకుల మనసులో చిరస్దాయిగా నిలిచిపోతారు. అలాంటివారిలో ఒకరు దాసరి నారాయణ రావు. ఈయన పేరు చెబితే సినీ ఇండస్ట్రీలో ఇప్పటికి భయపడే వారు ఉన్నారు అనడంలో సందేహం లేదు. నిజానికి అది భయం కాదు ఆయన అంటే అంత గౌరవం. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ దాసరి నారాయణ రావు గారికి ఏదో తెలియని పవర్ ఉంది. ఆయన తీసే సినిమాలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటాది. సినిమా కలెక్షన్స్ చూసుకోకుండా ఆయన అనుకున్న కధను తెరకెక్కిండంలో ఎంతటి సాహసానికైన ఆయన రెడీగా ఉంటారు.

ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికి కూడా సినీ ఇండస్ట్రీకి ఆయనే పెద్ద దిక్కు అని చాలామంది సెలబ్రిటీలు అంటుంటారు. అయితే ఇలాంటి మంచి వ్యక్తి పై ఒకానొక సందర్భంలో ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ స్టార్ హీరో రాయి తో కొడతాం అనుకున్నారనే సంగతి చాలా మందికి తెలియదు. అసలు దాసరి నారాయణ రావు గారి లాంటి లెజెండ్ డైరెక్టర్ ని కొడతాం అని అనుకున్న హీరో ఎవరు..? అసలు ఆయన ఎందుకు కొట్టాలి అనుకున్నాడు..? అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

దాసరి నారాయణ రావు గారిని రాయితో కొట్టాలి అనుకున్నింది అలనాటి హీరో జె.డి.చక్రవర్తి. ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. దాసరి గారు పద్మ గారితో ప్రేమలో ఉన్న సమయంలో జే.డీ.చక్రవర్తి తండ్రి సూర్యనారాయణ హెల్ప్ తోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారట. ఆ తరువాత దాసరి నారాయణరావు సినీ ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యాక ఓ రోజు వాళ్ల నాన్న జె.డి.చక్రవర్తిని దాసరి ఇంటికి తీసుకెళ్లితే. ఆయన రూంలో ఏదో పనిలో ఉన్నారు కొంచెం సేపు వెయిట్ చేయండి.. భోజనం చేసి వెళ్లండి అని చెప్పి పద్మ గారు లోపలికి వెళ్లిపోయారట. ఇక జే.డీ, వాళ్ళ నాన్న చాలా సేపు వెయిట్ చేసారట. తీరా సాయంత్రం అయ్యాక వాళ్ళ నాన్న ఆ డోర్ తీస్తే..లోపల ఉన్న దాసరి గారు ఆయన అసిస్టెంట్ అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారా అని అడిగేసారట. ఆ మాటలు విన్న జే.డీ.చక్రవర్తికి కోపం వచ్చిందట. మమ్మల్ని అవమానించిన దానికి..ఆ టైం లో నా చేతిలో రాయి ఉంటే కొట్టుండేవాడిని అని చెప్పుకోచ్చారు. అప్పుడు తన వయసు 11 సంవత్సరాలు అని చెప్పాడు జే.డీ.చక్రవర్తి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news