Moviesఆయన్ను కోర్టులో హాజరుపరచండి ..అక్రమాస్తుల కేసులో ఆ స్టార్ కమెడియన్‌కు బిగ్...

ఆయన్ను కోర్టులో హాజరుపరచండి ..అక్రమాస్తుల కేసులో ఆ స్టార్ కమెడియన్‌కు బిగ్ షాక్..!!

వడివేలు.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో ..కామెడీ టైమింగ్ తో కేవలం కోలీవుడ్ ప్రజలనే కాగా ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను సైతన్ కడుపుబ్బ నవ్వించిన స్టార్ తమిళ కమెడియన్. టాలీవుడ్, కోలీవుడ్ లో కమెడియన్ వడివేలు అంటే ఎంతో క్రేజ్ ఉండేది. 200లకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన తన కామెడీతో అందరి చేత నవ్వులు పూయించారు. కమెడియన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు.

ఒక్కప్పుడు ఈయన తెర పై కనిపిస్తే ఆ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందనే భావన డైరెక్టర్స్ లో కలిగేది. తమిళనాట బెస్ట్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వడివేలు అప్పట్లో కాల్ షీట్స్ దొరకడం అతి కష్టంగా ఉండేది. కానీ రీజన్ ఏంటో తెలియదు ..గత కొంత కాలంగా ఆయన తెరపై కనిపించడ లేదు. ఇప్పుడు ఆయన అనుకోబి చిక్కుల్లో ఇరుకున్నట్లు తెలుస్తుంది.

తాజాగా స్టార్ కమెడియన్‌ వడివేలు కు అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలని ఎగ్మూర్ న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఊహించని షాక్ తగిలింది. తాంబారం సమీపంలో ఆయనకు 3.5 ఎకరాల స్థలాన్ని రూ.1.93 కోట్లకు విక్రయించి దాన్ని లెక్కల్లో చూపించనట్లు గుర్తించారు. ఈ కేసు విచారణ ఎగ్మూర్ కోర్టులో గత కొంత కాలంగా నడుస్తోంది. నిజానికి వడివేలు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆయనకి సమన్లు పంపింది. కానీ, ఆయన కొన్ని అనుకోని కారణాల వల్ల అప్పట్లో విచారణకు హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలో తాజా కేసు పిటీషన్ విచారణకు వచ్చింది. అయితే వాదోపవాదాలు విన్న కోర్టు.. ఈసారి వడివేలు తప్పటిసరిగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news