MoviesMaa Elections: వైసీపీ ఎమ్మెల్యే రోజా సపోర్ట్ వాళ్ళకే..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన...

Maa Elections: వైసీపీ ఎమ్మెల్యే రోజా సపోర్ట్ వాళ్ళకే..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన రోజా..!!

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ( మా ) తెలంగాణ‌లో హుజూరాబాద్‌, బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల‌ను మించి ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌లో అటు ప్ర‌కాష్‌రాజ్ ఫ్యానెల్‌, ఇటు మంచు విష్ణు ఫ్యానెల్ హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ప్ర‌చార ప‌ర్వంలో విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటేసి చివ‌ర‌కు వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించుకునే వ‌ర‌కు వెళ్లింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు మనోజ్‌తోపాటు వారి ప్యానల్‌లో ఉన్న సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ.. ఎన్నడూ లేని విధంగా వీధిన పడ్డారు. పరస్పర ఆరోపణలతో రాజకీయ నేతల్లా తిట్టుకొనే స్థాయికి దిగజారాయి ‘మా’ ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ నెలకొంది.

మరో రెండు రోజుల్లో మా ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో,, నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సపోర్ట్ ఎవరికీ అన్న విషయాన్ని తెలియజేస్తూ ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చింది. ఇక ఆమె మీడియాతో మాట్లాడుతూ..“ఖచ్చితంగా ‘మా’ ఎన్నికల్లో పాల్గొంటాను. కానీ ఎవరైతే ‘మా’ అసోసియేషన్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారో.. ఏ ప్యానల్ ‘మా’ ఆర్టిస్టులకి ఉపయోగకరంగా మేనిఫెస్టో ఉంటుందో వారికే ఓటు వేస్తాను” అని తేల్చి చేప్పారు. కాగా ఇప్పటి వర్కు జరిగిన్న అన్నీ సర్వేల్లో ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news