Moviesవాటికి ఒప్పుకుంటేనే సినిమా చేస్తా..విడాకుల తరువాత కొత్త కండీషన్స్ పెడుతున్న స‌మంత‌..?

వాటికి ఒప్పుకుంటేనే సినిమా చేస్తా..విడాకుల తరువాత కొత్త కండీషన్స్ పెడుతున్న స‌మంత‌..?

ఏమామ చేశావే సినిమాలో జెస్సీ పాత్ర‌తో ఒక్క‌సారిగా సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని త‌న వైపున‌కు తిప్పుకుంది స‌మంత‌. ఏడెనిమిది సంవ‌త్స‌రాలు అయితే కోలీవుడ్ లేదు… టాలీవుడ్ లేదు.. మొత్తం సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. కోలీవుడ్ విజ‌య్‌, సూర్య‌, విశాల్ నుంచి ఇటు టాలీవుడ్‌లో ప‌వ‌న్‌, మ‌హేష, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ ఇలా అంద‌రు స్టార్ హీరోల‌తోనూ న‌టించి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసింది.

ఇక అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకున్న స‌మంత నాలుగేళ్ల కాపురం త‌ర్వాత అంద‌రికి స‌డెన్ షాక్ ఇస్తూ అత‌డికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైందిసినిమా వాళ్లు క‌లుస్తారు.. త్వ‌ర‌గా విడిపోతారు అన్న నానుడిని మ‌రోసారి నిజం చేశారు అక్కినేని నాగ‌చైత‌న్య – స్టార్ హీరోయిన్ స‌మంత‌. నాలుగేళ్ల‌కే వీరి బంధం తెగిపోయింది. స‌మంత కేవ‌లం కెరీర్ కోస‌మే ఈ బంధాన్ని తెంచేసుకుంద‌ని అంటున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు ఫుల్ రిలాక్స్ అయిపోయాడు.

రెండు నెల‌లుగా విడాకులు తీసుకుంటోన్న నేప‌థ్యంలో చైతు తీవ్ర‌మైన మానసిక సంఘ‌ర్ష‌ణ‌కు గుర‌య్యాడు. స‌మంత‌ను క‌న్విన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. చివ‌ర‌కు ఆమెతో విడాకులు తీసుకోవ‌డంతో ఇప్పుడు ఆ భారం అంతా దిగిపోయిన‌ట్టే ఉంది. క‌ట్ చేస్తే ఇప్పుడు చైతు వ‌రుస‌గా త‌న సినిమాలు ప‌ట్టాలెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఇక సమంత కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూపోతుంది.

అయితే విడాకుల తరువాత సినిమా చేయడానికి సమంత కొత్త కండీషన్స్ పెట్టిన్నట్లు తెలుస్తుంది. . సమంత తాను చేయబోయే సినిమాల షూటింగ్ లొకేషన్స్ చెన్నై, ఆ చుట్టు ప్రక్కల ఉండేలా చూడమంటోందట. హైదరాబాద్ లో షూటింగ్ లు పెట్టదు అంటుందట. ఒక్కవేళ పెట్టినా ఇన్ దోర్ షూటింగ్స్ పెట్టమని కొన్ని కండీషన్స్ పెడుతుందట. . త‌న కండీష‌న్స్ ఓకే అంటేనే స‌మంత సినిమాల‌కు సైన్ చేస్తానంటుంది. శాకుంత‌లం సినిమా షూటింగ్ పూర్తి చేసిన స‌మంత ప్ర‌స్తుతం త‌మిళ సినిమా చేస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news