Moviesతప్పనిసరి పరిస్థితుల వల్లనే ఇలా చేసాం.. శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..!!

తప్పనిసరి పరిస్థితుల వల్లనే ఇలా చేసాం.. శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..!!

ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బొంబాట్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ సినిమాను.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే లవ్ స్టోరీ చిత్రం ‘వినాయక చవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలనున్నారు చిత్ర బృందం. కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా విడుదల వాయిదా పడ్డింది. అయితే తాగాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ– “తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ మా ‘లవ్‌ స్టోరీ’ని వాయిదా వేస్తూ వచ్చాం. సినిమాని చూపించడానికి మంచి సమయం కోసం ఎదురు చూశాం. ఆ టైమ్‌ వచ్చింది” అన్నారు.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై-సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చైతు కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news