Moviesశంక‌ర్ సినిమాలో సునీల్ పాత్ర గురించి తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..?

శంక‌ర్ సినిమాలో సునీల్ పాత్ర గురించి తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..?

ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌, హీరో సునీల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అలాగే ఈయనకు ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్ లో ఉంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, సునీల్ భీమ‌వ‌రంలో క‌లిసి చ‌దువుకున్నారు. సునీల్‌ది ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం ప్రాంతం. అయితే మొదట విలన్ అవుదామని సినీ సినీ ఇండస్ట్రీకి వచ్చి కమెడీయన్ అయ్యాడు. కమెడియన్ గా మొదలుపెట్టి తర్వాత చిన్న గా హీరోగా మారాడు. అయితే ఒకవైపు కమెడియన్ గా, మరొక వైపు హీరోగా నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. హీరోగా మారాక సునీల్ ఆరంభంలో వ‌రుస‌గా హిట్లు కొట్టాడు. ఆ త‌ర్వాత సునీల్ చేసిన సినిమాలు అన్నీ వ‌రుస‌గా ప్లాప్ అవుతున్నాయి.

క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన సునీల్ వ‌రుస ప్లాపుల‌తో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారాడు. ఇక ఇటీవ‌ల సునీల్ వ‌రుస‌గా ప్ర‌యోగాలు చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే ర‌వితేజ డిస్కోరాజాలో చివ‌ర్లో విల‌న్‌గా షాక్ ఇచ్చిన సునీల్ ఆ తరువాత క‌ల‌ర్ ఫొటో సినిమాలో ఫుల్ లెంగ్త్ విల‌న్‌గా మెప్పించాడు. ఇక అర‌వింద స‌మేత‌, చిత్ర‌ల‌హ‌రి, అల వైకుంఠ‌పురంలో సినిమాల్లో క‌మెడియ‌న్‌గా చేస్తూనే మ‌రోవైపు విల‌న్‌గా కూడా త‌న స‌త్తా చాటేందుకు త‌గిన అవ‌కాశం కోసం వెయిట్ చేస్తున్నాడు. హీరోగా స‌రైన హిట్స్ లేని సునీల్ గ‌త రెండేళ్లుగా యూ ట‌ర్న్ తీసుకున్నాడు.

తాజాగా ఆయన స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ టాలీవుడ్ హీరో రాంచ‌ర‌ణ్ తో 15వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ అండ్ టీం విడుద‌ల చేసిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ లో ఉన్న క‌మెడియ‌న్ సునీల్ ను కీల‌క పాత్ర‌లో తీసుకున్నాడు శంక‌ర్‌. తాజాగా ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌ల ప్ర‌కారం ఈ మూవీలో సునీల్ నెగిటివ్ పాత్ర పోషిస్తున్నాడట. అంతేకాదు ఈ పాత్ర‌కి రాం చరణ్ తో ఇంటర్వెల్ సీన్ ముందు వచ్చే సీన్స్ టోటల్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. గత కంత కాలంగా సరైన హిట్ లేని సునీల్ కి ఇలాంటి ప‌రిస్థితుల్లో శంకర్ సినిమాలో అవ‌కాశం రావడంతో..ఇపుడు అంద‌రి చూపు సునీల్ పైనే ఉంది. మరి చూడాలి ఈ సినిమాతోనైనా సునీల్ కెరీర్ చక్కదిద్దుకుంటుందేమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news