Moviesబిగ్ షాకింగ్: తమన్నా ఎంత కమర్షియల్ అయిపోయిందంటే.. చివరికి అలాంటి పాత్రలో..??

బిగ్ షాకింగ్: తమన్నా ఎంత కమర్షియల్ అయిపోయిందంటే.. చివరికి అలాంటి పాత్రలో..??

టాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. హ్యాపీడేస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో నటిస్తుంది. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైంలో ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ పని ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంబినేషన్స్ రిపీట్ చూసేందుకు కూడా ఇష్టపడట్లేదు. సమంత ఎలాగు అక్కినేని కోడలుగా మారిన తర్వాత సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. ఇక వచ్చిన అవకాశాలతో కాజల్ ఈమధ్య మళ్లీ కెరియర్ స్పీడందుకోగా తమన్నా మాత్రం అరకొర అవకాశాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ఇక బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఈమె అవకాశాలు కోసం డైరెక్టర్స్ కి ఫోన్ చేయడం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు.ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే..తమన్నా సినీ కెరీర్ కి ఎండ్ కార్డ్ పడే టైం దగ్గరకి వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే..అమ్మడుకి ఆఫర్స్ రావడం లేదు. వచ్చిన్స్ చిన్న చితకా ఆఫర్స్ ని తమన్నా డబ్బు కోసం చేస్తుంది. ఇక తమన్నా బాగా కమర్షియల్ అయిపోయిందని అంటున్నారు జనాలు. డబ్బు కోసం ఎలాంటి పాత్ర నైనా చేసుకుంటూ పోతుంది..అందుకే ఏ చిన్న అవకాశం వదలను అంటుంది తమన్నా.

అంతేకాదు తెలిసిన దర్శకులతో తనకు ఛాన్స్ ఉంటే ఇవ్వండి అంటూ అడుగుతుందట. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ ఎవరు ఇలా అడిగినట్టు ఎప్పుడు చెప్పుకోలేదు. కాని అవకాశాల కోసం మొహమాటం లాంటివి పక్కన పెట్టేసిన తమన్నా సినిమా ఛాన్స్ ఇవ్వండి ఎలాంటి రోల్ అయినా పర్వాలేదు. అవసరమైతే గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచుతా అంటుందట. క్రేజ్ ఉన్న ఈ కొద్దినాళ్లలో ఎంతోకొంత మొత్తాన్ని సంపాదించాలని ప్లాన్ చేసింది అమ్మడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..తమన్న ఓ వెబ్ సిరీస్ ని ఒప్పుకుందట. జీ5 లో రానున్న ఈ సిరీస్ లో తమన్నా లీడ్ రోల్ లో కనిపించబోతుందట.ఈ సిరీస్ లో తమన్నా ఒక ఐటమ్ గర్ల్ గా నటించబోతుందట.ఎలాగూ హీరోయిన్ ఛాన్స్ లు రావడం లేదు కాబట్టి.. రూట్ మార్చి.. ఇలా బోల్డ్ పాత్రలకు ఓకే చెబుతోందట. ఈ క్రమంలోనే ఈ మధ్య ఈ ముదురు మిల్కీ బ్యూటీ ఎక్కువగా తెగ ఫ్యాషన్ షూట్ లు చేస్తోందట. ప్రతి వారం ఎదో ఒక ఫోటోషూట్ చేస్తూ ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది తమన్నా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news