Moviesజపాన్ లో తెలుగు సినిమాలకు అంత క్రేజ్ తీసుకువచ్చిన హీరో ఎవరో...

జపాన్ లో తెలుగు సినిమాలకు అంత క్రేజ్ తీసుకువచ్చిన హీరో ఎవరో తెలుసా..??

సాధారణంగా ఏ దేశంలోనైన ఆ దేశానికి సంబంధించిన హీరోలు..వారి సినిమాలతో ఒక ట్రెండ్ ను సెట్ చేస్తూ ఉంటారు.. అయితే ఇటీవల కాలంలో తెలుగు హీరోలు కాస్త జపాన్ లో సినిమాలు విడుదల చేసి, ఒక ట్రెండ్ ను సెట్ చేసిన విషయం తెలిసిందే. అసల మన సినిమాలకు కూడా జపాన్ లో అంత క్రేజ్ ఉందా? మన ఇండియన్ సినిమాలకు జపాన్ లో అంత క్రేజ్ ఏర్పడేలా చేసిన హీరో ఎవరు అని ఆరా తీస్తే..! ఇంకెవరు మన తలైవా రజినీ కాంత్ అని తెలిసింది. అవును రజినీకాంత్ గారి వల్లే జపాన్లో మన ఇండియన్ సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. ఆయనతో పాటు మరికొంత మంది హీరోలు కూడా అక్కడ సత్తా చాటారు. కానీ రజినీకాంత్ గారి వల్లే జపాన్లో మన ఇండియన్ సినిమాలకు ఇంత క్రేజ్ వచ్చిందని తేలింది.

తలైవా రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన “ముత్తు” సినిమా జపాన్ లో కూడా విడుదలై అద్భుతమైన విషయం సాధించింది. దీంతో అప్పటి నుంచి జపాన్ లో కూడా రజినీకి అభిమానగణం భారీగానే ఏర్పడింది. అందుకే తలైవా సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అవుతాయి. జపాన్ లో ట్రెండ్ సెట్ చేసిన హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తింపు పొందగా.. ఆ తరువాత జపాన్ లో తెలుగు సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్ గా మారి తన సత్తా చాటింది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్.యస్.. ‘బాద్ షా’ మూవీతో జపాన్ లో తెలుగు సినిమా స్టామినా ఏంటన్నది చూపించాడు ఈ యంగ్ టైగర్.

రజినీకాంత్ గారు ‘ముత్తు’ తో జపాన్ లో నెలకొల్పిన రికార్డులను ..మన డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తో ఆ రికార్డు లని బ్రేక్ చేసాడు. మన ప్రభాస్ ఆరు అడుగులకి..ఆ కటౌట్ కి.. ఫిదా అయిపోయారు అక్కడి జనాలు. ఇక రాజముళి తీసిన ‘మగథీర’ కు కూడా జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. బాహుబలి’ తో మాత్రమే కాదు ‘సాహో’ తో కూడా జపాన్ బాక్సాఫీస్ ను షేక్ చేసాడు ప్రభాస్. ఇక ఆ తర్వాత అక్కడ బాగా అదరగొట్టింన సినిమా ఏదైనా ఉంది అంటే అది.. నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమా మాత్రమే. ఈ సినిమా కూడ మంచి కలెక్షన్లు రాబట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news