Moviesచ‌రణ్ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

చ‌రణ్ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

ప్రస్తుతం మనం చూసుకున్నట్లైతే..స్టార్ హీరోలంతా వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తూ…బిజీ బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ..సినిమాకు సంబంధించి నటీనటులు,దర్శకుడు, నిర్మాత, సాంకేతిక నిపుణులతో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేసారు.

We Are Coming అంటూ హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా అందరు ఒకే తరహా సూటు బూటు కాస్టూమ్స్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ పోస్టర్‌ను చాలా కొత్తగా ..అందరిని ఆకట్టుకునేలా ఉంది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై, మూవీ టీంకి విషెస్ తెలియజేశారు. ముహూర్త‌పు సన్నివేశానికి చిరు క్లాప్ నివ్వగా, రణ్‌వీర్ సింగ్ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

అయితే ఈ వేడుకలో చ‌ర‌ణ్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఆ లుక్ చూసి బాలీవుడ్ బడా హీరో రణ్‌వీర్ సింగ్ సైతం ఇంప్రేస్ అయ్యారు. ఇక ఆ వేడుకలో చరణ్ ధరిచిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ వాచ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వాచ్‌కి రిస్ట్ రన్ మిషన్ వాచ్‌గా పేరుంది. ఒలంపిక్స్‌లో 100 ఇంకా 200 మీటర్స్‌లో ప్రపంచ రికార్డ్ సాధించి ఫాస్టెస్ట్ రన్నర్‌గా నిలిచిన యోహన్ బ్లేక్ కోసం రిచర్డ్ మిల్లే కంపెనీవారు ఈ వాచ్‌ని స్పెషల్‌గా డిజైన్ చేశారట‌. రిచర్డ్ మిల్లె ఋం 61-01 యోహన్ బ్లేక్ వాచ్‌ని ఇప్పుడు చెర్రీ ధ‌రించ‌గా, ఆ వాచ్ ఖ‌రీదు మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 1.02 కోట్లు ఉంటుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news