Moviesబాలయ్య క్రేజీ డెసీషన్.. ఆ డైనమిక్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..?

బాలయ్య క్రేజీ డెసీషన్.. ఆ డైనమిక్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..?

నందమూరి హీరో బాలకృఇష్ణ..యంగ్ హీరో లకు ఏమాత్రం తీసిపోకుండా..వాళ్లతో పోటీ పడుతూ..వరుస సినిమాలకు సైన్ చేస్తూ..యమ జోరు మీద ఉన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి – బాల‌య్య కాంబో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు అఖండ సైతం వీరి కాంబోలో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే బాలయ్య త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ చేసిన గోపీచంద్ మలినేని .. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే..బాలకృష్ణ మరో డైనమిక్ డైరెక్టర్ సినిమా కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ చిత్రం గురించి నాని “టక్ జగదీష్” యువ నిర్మాత సాహు గారపాటి క్లారిటీ ఇచ్చేశారు.వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని..ఈ సంవత్సరం దసరాకు ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే బాలయ్య-అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ “ఎఫ్3” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత బాలయ్య సినిమాపై దృష్టి పెడతాడని గారపాటి తెలిపారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news