Newsఎన్టీఆర్ ను పక్కన పెట్టేసి..ఆ యంగ్ హీరో తో సినిమాకు సిద్ధమైన...

ఎన్టీఆర్ ను పక్కన పెట్టేసి..ఆ యంగ్ హీరో తో సినిమాకు సిద్ధమైన “ఉప్పెన” డైరెక్టర్..??

సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఎన్నో కష్టాలు పడి, అవమానాలు ఎదుర్కొని, గుర్తింపుకు నోచుకోని వాళ్లు.. తొలి సినిమాతో అద్భుత విజయాన్ని అందుకోవడంతో రాత్రికి రాత్రి వారి జీవితాలు మారిపోయిన ఉదంతాలు చాలానే టాలీవుడ్లో కనిపిస్తాయి. ‘ఉప్పెన’తో పరిచయం అయిన యువ దర్శకుడు బుచ్చిబాబుది ఇలాంటి స్టోరీనే. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడితో సినిమా అంటే హీరోలు కూడా ముందు వెనుక ఆలోచించకుండా సరే అంటున్నారు. దానికి కారణం ఈ మధ్య విడుదలైన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా. ఈ చిత్రంతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈయన సుకుమార్‌కు ప్రియ శిష్యుడు. గురువు గారి పేరు నిలబెడుతూ తొలి సినిమాతోనే రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు రెండవ సినిమా కోసం ఎన్టీఆర్ ని ఒప్పించి అందరికీ షాకిచ్చాడు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టిఆర్ బుచ్చిబాబుతో సినిమాని పట్టాలెక్కించలేకపోతున్నారు. బుచ్చిబాబు రెడీ చేసిన బౌండెడ్‌ స్క్రిప్ట్‌ ఎన్టీఆర్ కు బాగా నచ్చేసిందట. కానీ, ఎంత నచ్చినా.. ఇప్పట్లో ఈ మూవీ ఉండదు. ఎందుకంటే ఆర్ఆర్‌ఆర్.. కొరటాల… ప్రశాంత్‌ నీల్‌ సినిమాలు ముందు పూర్తికావాలి. ప్రయారటీ ప్రకారం చూస్తే.. బుచ్చిబాబు సినిమా 2023లో ఉండొచ్చేమో అన్న మాటలి సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఇక దీంతో ఈ డైరెక్టర్ తారకు కొన్ని రోజులు తారక్ ను పక్కన పెట్టేసి..మరో యంగ్ మెగా హీరోతో సినిమా చేయడానికి సిద్ధమైన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా బుచ్చిబాబు మూడవ సినిమా మాత్రం ఓక్కాగా ఎన్టీఆర్ తోనే ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ మరి కొన్ని సూపర్ హిట్ లు అందుకునే దాకా బుచ్చిబాబుకి ఆ స్టార్ స్టేటస్ రాదంటున్నారు సినీ ప్రముఖులు. మరి బుచ్చిబాబు తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటారో తెలియాలంటే మరి కొత కాలం వేచి చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news