Moviesరవితేజకి ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..??

రవితేజకి ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..??

రవితేజ..ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచి..మాస్ మహారాజ్ అనే బిరుదు సొంతం చేఉకున్న ఈయన.. సినిమా అంటేనే ఫ్యాన్స్ ఈలలు వేసుకుంటూ హాళ్ళవైపు పరుగులుపెట్టేవారు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అతి తక్కువ మంది హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు.

స్క్రీన్ మీద రవితేజ హీరోయిజం తో కూడిన అల్లరి అందరిని ఆకట్టుకునేది. కమెడియన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన రవితేజా కెరియర్ టాప్ హీరో రేంజ్ కి రాకెట్ లా దూసుకుపోయింది. అయితే…. ఇప్పుడు ఆ రాకెట్ ఎంత వేగంతో పైకి దూసుకుపోయిందో అంతే స్థాయిలో కిందికి దూసుకు వచ్చేసింది. గత కొంత కాలంగా రవితేజ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి.

ఇలా వరుసగా ప్లాప్ లు పలకరించడంతో రవితేజ తో సినిమా అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. అయితే రీసెంత్ గా క్రాక్ సినిమాతో మళ్లి ఫాం లోకి వచ్చాడు రవితేజ. అయితే సోషల్ మీదియాలో ఈ హీరో ఫస్ట్ రెమ్యూనరేష్ గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్న రవితేజ దాదాపుగా ప్రతి సినిమాకు రూ. 10 కోట్ల కు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్.. అయితే రవితేజ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ.. ముందుగా సపోర్ట్ రోల్స్ చేస్తూ అక్కడి నుంచి హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అలా నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే ఆ సినిమాకి నిర్మాత కూడా నాగార్జుననే కావడంతో..అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన రవితేజ కు హీరో నాగార్జున 3500 రూపాయల చెక్కును ఇచ్చారట. ఇక అలా నాగార్జున చేతుల మీదుగా రవితేజ తన తొలి రెమ్యునరేషన్ ను అందుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news