Moviesఆ ఒక్క ట్వీట్ తో.. విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్...

ఆ ఒక్క ట్వీట్ తో.. విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఖుషీ ఖుషీ..!!

టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ హీరోగా విజయ్ దేవరకొండ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అయితే తాజాగా ఈ సినిమా కోసం విజయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు ట్వీట్ చేసాడు. ఆయన షేర్ చేసిన ఫోటో చూసిన్నట్లైతే ఈ సినిమా కోసండబ్బింగ్ పనులు మొదలు పెట్టిన్నట్లు తెలుస్తుంది ‘యువర్ బాయ్ ఈజ్ బ్యాక్.. వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ఫోటోను షేర్ చేశాడు. ‘లైగర్’ టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని ఈ సంధర్బంగా విజయ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news