Gossipsఆదికి మాత్రమే ఆ ఆఫర్ నా..?? మిగతా కంటెస్టెంట్స్ పనికిరారా..??

ఆదికి మాత్రమే ఆ ఆఫర్ నా..?? మిగతా కంటెస్టెంట్స్ పనికిరారా..??

హైపర్‌ ఆది..ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. జబర్ధస్త్ అనే షో ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆది తనదైన శైలిలో కామెడీ పండిస్తూ హైపర్‌ ఆదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు… చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌, పంచు డైలాగులతో షోని రక్తి కట్టిస్తాడు. ఇక ఏ షో చేసిన అందులో ఆడవాళ్లు, మహిళ యాంకర్స్‌పై అతడు వేసే డబల్‌ మీనింగ్‌ పంచ్‌లు మాములుగా ఉండవు. ఎంతటి వారినైనా అవి ఆకట్టుకుంటాయి. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఎదుటి వారిపై పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందిస్తుంటాడు.

ప్రస్తుతం ఓ వైపు జబర్దస్త్ మరోవైపు “ఢీ” షోలతో బిజీ బిజీగా ఉన్న ఆదికి మరో బపర్ ఆఫే వచ్చిన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. హైపర్ ఆది టాలెంట్ కు ఫిదా అయ్యి.. మెచ్చి తన తదుపరి చిత్రంలో ఓ మంచి పాత్ర ఇచ్చినట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక అదే విషయాన్ని చెప్పడానికి చిరంజీవి హైపర్ ఆదిని ఇంటికి పిలిపించి మరీ సర్ప్రైజ్ చేసినట్లు అంటున్నారు. త్వరలో ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.

మరి ఈ విషయం ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ విషయమై.. జబర్ధస్త్ టీం లీడర్స్ మధ్య పెద్ద రచ్చే జరుగుతుందట. నిజానికి జబర్ధస్త్లో హైపర్ ఆది ఒక్కడే కాదు ఎందరో మంచి మంచి కంటెస్టేంట్స్ ..టాలెంటేడ్ టీం లీడర్స్ కూడా ఉన్నారు.. కానీ చిరంజీవి కంటికి హైపర్ ఆది ఒక్కడే కనపడ్డారా.. మిగతా వాళ్లు కనపడలేదా అంటూ మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news