Moviesహీరో ని పక్కన పెట్టేసి డైరెక్టర్ ని కౌగిలించుకున్న ఈ హీరోయిన్...

హీరో ని పక్కన పెట్టేసి డైరెక్టర్ ని కౌగిలించుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..??

తెలుగు తెర మీద హావా అంతా ఈ మధ్య వచ్చిన కొత్త హీరోయిన్లదే. ఏ స్టార్ హీరోల పక్కన చూసినా వీరే కనిపిస్తున్నారు. ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారంతా ఒకప్పుడు చిన్న హీరోయిన్లుగా వెండి తెరమీద మెరిసినవారే. ఇదే కోవలో వచ్చిన హీరోయిన్ రాసి కన్నా. మద్రాస్ కెఫే తో వెండితెరకు పరిచయం అయిన రాశీఖన్నా..అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘ఊహలు గుసగుసలాడే ‘సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ అందాల భామ ఆ తరువాత సుప్రీమ్ సినిమాలో సాయిధరమ్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఊహలు గుసగుసలాడే‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బొద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈమె నటన అందం చూసిన ఇతర దర్శకులు నిర్మాతలు ఆయా చిత్రాల్లో అవకాశాలు పుష్కలంగా ఇచ్చారు.దాంతో వరుస ఆఫర్లు రావడంతో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న ‘రాశీ ఖన్నా‘ చెప్పుకోదగిన హిట్ సినిమాలు మాత్రం అందుకోలేకపోయింది.ఆ తరువాత తరువాత మెల్లిగా ఒక్కొక్క హిట్ సినిమాలో నటిస్తూ టాప్ రేంజ్ కి చేరుకుంది. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేసింది.

అయితే తాజాగా ఓ పాన్ ఇండియా వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇఛ్చేందుకు రెడీ అయింది రాశీ. ఈ సిరీస్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. ప్రముఖ దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ని రూపొందిస్తున్నారు.అయితే తాజాగా ఈ సిరీస్ షూటింగ్ సెట్స్ లో ఆమె దర్శకుడిని కౌగిలించుకుంటే ..పక్కనే ఉన్న హీరో షాహిద్ కపూర్ అలా వాళ్ళను చూస్తూ ఉండిపోయే ఫోటోను షేర్ చేసింది. దీనికి ‘బాధపడకు షాహిద్ వాళ్లు నిన్ను ఇష్టపడతారులే’ అంటూ రాశీ ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news