Movies"లవ్‌స్టోరీ" నుండి క్రేజీ అప్డేట్..సినిమా రిలీజ్ ఎప్పుడంటే..??

“లవ్‌స్టోరీ” నుండి క్రేజీ అప్డేట్..సినిమా రిలీజ్ ఎప్పుడంటే..??

ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బొంబాట్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల తన నెక్ట్స్ సినిమాను.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం మేరకు.. లవ్ స్టోరీ చిత్రం ‘వినాయక చవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 10వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై-సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చైతు కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. అదేంటంటే.. సినిమా విడుదల తేదీని బుధవారం ఉదయం 11.07 గంటలకు ప్రకటిస్తామని స్పష్టం చేశారు సినిమా బృందం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news