Gossipsబాలీవుడ్ భామ పై కన్నేసిన బన్నీ..మరీ ఆమె ఒప్పుకుంటుందా..??

బాలీవుడ్ భామ పై కన్నేసిన బన్నీ..మరీ ఆమె ఒప్పుకుంటుందా..??

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోగా మంచి జోరు మీద ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోలలో బ‌న్నీయే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్నాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌నోడి క్రేజ్ అలాంటిది మరి. నిజానికి అల్లు అర్జున్ చేసింది తక్కువ సినిమాలే అయినా..మంచి భారీ భారీ బ్లక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇండ‌స్ట్రీ ప‌రంగా అతి త‌క్కువ టైంలోనే సూప‌ర్ హిట్ల‌తో ఓ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠపురంలో ఘన విజయాన్ని సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే, వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి వేణు శ్రీరామ్ ఐకాన్ అనే టైటిల్ ఫిస్ చేసారు. దీనికి కనుబడుట లేదు అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అయినా కొన్ని అనివార్య కారణాలతో రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా యువ నటి అనన్య పాండేను పెట్టాలని ఆయన సూచించినట్లు టాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఇక ఇప్పటికే అనన్య.. విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తోంది. ఒకవేళ ఇప్పుడు అల్లు అర్జున్‌తో కూడా అనన్య నటిస్తే.. టాలీవుడ్ లో కూడా ఆమె మంచి పేరు తెచ్చుకుంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news