Moviesగృహలక్ష్మి సీరియల్ అంకిత బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..??

గృహలక్ష్మి సీరియల్ అంకిత బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..??

బుల్లితెర మీద సీరియల్స్ కి గల క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. తెలుగు బుల్లితెరపై సిరియల్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందుకే అన్ని సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ధారావాహికంగా నడుస్తున్నాయి. TV సీరియల్స్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో నటీనటులు తమ నటనతో,అందంతో అలరిస్తున్నారు. అందుకే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఒక ఇంటి ఇల్లాలు తమ కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతోందో ఈ సీరియల్ నిరూపిస్తోంది.

బాగా పాపులర్ అయిన ఈ సీరియల్ లో కస్తూరి పెద్ద కోడలుగా అంకిత తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో పాజిటివ్, నెగెటివ్ రెండు రోల్స్ లో నటించి మెప్పిస్తున్న అంకిత అసలు పేరు ఉత్తరా రెడ్డి. ఈమె బెంగుళూరులో నవంబర్ 29న జన్మించింది. ఇక ఈమెకి చిన్నతనం నుండే యాక్టింగ్,డాన్స్ అంటే చాలా ఇష్టమట.. అందుకే స్కూల్ ,కాలేజీ డేస్ లో ప్రతి కల్చరల్ ప్రోగ్రాం లో పాల్గొంటూ..అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంది.

ఇక అంకిత షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ద్వారా తన కెరీర్ స్టార్ట్ చేసి..ఇండిపెండెంట్ మూవీతో పాటు సుమంత్ హీరోగా వచ్చిన సుబ్రహ్మణ్యపురం మూవీలో కూడా ఉత్తరా నటించింది. గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఉత్తర తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో ఆమె పర్ ఫామెన్స్ కి ఆడియన్స్ మంచి మార్కులే వేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news