Moviesరష్మిక తీరు పై మండిపడుతున్న నెటిజన్స్ .. రీజన్ ఇదే..!!

రష్మిక తీరు పై మండిపడుతున్న నెటిజన్స్ .. రీజన్ ఇదే..!!

ప్రస్తుతం మనం ఎటువంటి పరిస్ధితుల మధ్య బ్రతుకుతున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత రెండు నెలలుగా కరోనా రెండో దశ భారతదేశంపై ఎలా ఉందో మనందరికి తెలిసిందే. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఈ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికి అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేశాయి. ఈ విధంగా కరోనా మహమ్మారిను అదుపు చేయడం కోసం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

కరోనా అనే రక్కసి మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఇంటి నుంచి బయట అడుగు పెడితే చాలు మాస్కు తప్పనిసరిగా మారిపోయింది. అయితే తాజాగా నటి రష్మిక మందన్న మాస్క్ లేకుండా బయటకనిపించింది. ఇంకేముంది సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆమె మీద ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది ముంబయికు షిఫ్ట్‌ అయిన విషయం తెలిసిందే.

తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘మిషన్ మజ్ను’ ఆమె కొద్ది రోజుల నుండీ అక్కడే ఉంటూ వస్తుంది. అంతేకాదు గ్లామర్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది. ఆ సమయంలో కారులో నుంచి దిగి ముందుకు నడుస్తూ వెళ్లింది.

అయితే.. మాస్కు ధరించడాన్ని మరిచిపోయింది. దీంతో వెంటనే తన పొరపాటును తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ వెనక్కి వెళ్లి కారులో ఉన్న మాస్కును తెచ్చుకుంది. ‘మాస్క్ మరిచిపోయినందుకు క్షమించండి’ అంటూ వారిని వేడుకుంది. దీనంతటిని ముంబయి మీడియా తమ కెమెరాల్లో బంధించింది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రష్మిక మందన్నా సోషల్ మీడియాలో చేసే సందడికి అందరూ ఫిదా అవుతుంటారు. ఆమె పెట్టే క్యూట్ ఫోటోలకు నెటిజన్లు పడిపోతుంటారు. ఇక ఆమె చేసే అల్లరికి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంటుంది. రష్మిక మందన్నా తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటారు.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news