Moviesఈ జంట ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలిస్తే..నోరెళ్లబెడుతారు..?

ఈ జంట ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలిస్తే..నోరెళ్లబెడుతారు..?

శ్రీ రామదాసు లాంటి సినిమాలో నాగార్జునతో అదిరిపోయే రొమాన్స్ చేసిన స్నేహ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. అయినా ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరస సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. దక్షణాది చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో స్నేహ నటించింది. సీనియర్ హీరోలతో పాటు అప్పుడప్పుడూ కుర్ర హీరోలతో కూడా నటించింది స్నేహ. గ్లామర్ కు దూరంగా ఉంటూనే స్టార్ అయింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత తమిళనాడుకు వెళ్లి అక్కడ కూడా వరస సినిమాలు చేసింది స్నేహ. ఇక ప్రముఖ నటుడు ప్రసన్న వెంకటేశన్ ని స్నేహ వివాహం చేసుకుంది. తమిళంలో వీరిద్దరూ కలసి ఓ చిత్రంలో నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి అప్పుడప్పుడూ చేస్తుంది. తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా స్నేహ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. స్నేహ ఖాతాలో శ్రీరామదాసు, వెంకీ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వివాహం తర్వాత స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది.

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటించిన స్నేహ పెళ్లయ్యాక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. పైగా ఆమె భర్తతో కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ జంట కంఫర్ట్ ఫాబ్రిక్ , ఆశీర్వాద్, సన్ ఫీస్ట్ మ్యారి లైట్ , విమ్, జి.ఆర్.టి జ్యుయలర్స్ వంటి ఎన్నో యాడ్స్ లో చేసారు. ఇక స్నేహ ప్రత్యేకించి వైభవ్ కలెక్షన్స్, ఆశీర్వాద్ గులాబ్జామ్ వంటి యాడ్స్ లో చేసింది. మొత్తం మీద ఒక్క యాడ్స్ రూపంలోనే ఇప్పటివరకూ 2.87 కోట్ల రూపాయల దాకా కూడబెట్టారని టాక్. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ యాక్టర్ గా రాణిస్తూ, యాడ్స్ లోనూ దుమ్మురేపుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news